
CSK opener : ఐపీఎల్ 16వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం ఇక చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే అన్ని జట్లు 14 లీగ్ మ్యాచ్లను ముగించుకున్నాయి. పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు క్వాలిఫైయర్ దశకు చేరుకున్నాయి. అయితే ఈసారి కూడా ఆయా విభాగాల్లో రికార్డుల పరంపర కొనసాగుతున్నది. క్వాలిఫయర్ దశలో మొదటి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. అయితే సీజన్ మొత్తం అన్ని జట్ల ఆటగాళ్లు నువ్వా.. నేనా అన్నట్లుగా ఆడారు. ఇక క్వాలిఫయర్ దశకు చేరుకోని జట్లు ఇంటి దారి పట్టాయి. అయితే క్వాలిఫయర్ 1 మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్స్ సరికొత్త రికార్డు సృష్టించారు.
తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ జోడి సరి కొత్త రికార్డు సృష్టించింది ఇప్పటివరకు తమ పేరు మీదే ఉన్న రికార్డును అధిగమించింది. ఓపెనింగ్ జోడి కాన్వే – గైక్వాడ్ మరోసారి తమ ఆటతో సత్తా చూపారు. ఓ సీజన్లో చెన్నై తరపున అత్యధిక పరుగులు చేసిన ఓపెనింగ్ జోడిగా చరిత్ర సృష్టించారు. ఈ సీజన్లో 14 మ్యాచ్లు ఆడి 775 పరుగులు చేశారు. గతంలో 16 ఇన్నింగ్స్ ఆడి 688 పరుగులు చేసింది. వీరి తర్వాత ఎస్సీ విజయ్, మెకల్లం స్మిత్ ఉన్నారు.
అయితే ఐపీఎల్ మ్యాచ్ ఈ ఆదివారం జరగనుంది. క్వాలిఫయర్ 1 లో గెలిచి చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ఫైనల్ చేరుకుంది. ఇక క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో గెలిచే జట్టు కూడా ఫైనల్ కు చేరుకోనుంది. ఇక క్వాలిఫయర్ 2 మ్యాచ్ కోసం ఇప్పటికే అహ్మదాబాద్ స్టేడియం ముస్తాబైంది. గుజరాత్ లోని మోదీ స్టేడియంలో28న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.