
Allu Aravind : అల్లు అర్జున్ కెరీర్ ప్రారంభ దశలో కొన్ని కీలకమైన అవకాశాలను వదులుకోవాల్సి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన భద్ర సినిమా మొదటిగా అల్లు అర్జున్‌కి ఆఫర్ అయిందన్న వార్తలు ఉన్నాయి. అయితే, ఆ ప్రాజెక్ట్ ఎందుకు జరగలేదో అనేది స్పష్టంగా తెలియనప్పటికీ, కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అల్లు అరవింద్ ఆ కథపై ఆసక్తి చూపకపోవడమే కారణమన్న టాక్ ఉంది.
అలాగే శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన వెంకీ సినిమాలో కూడా మొదట అల్లు అర్జున్ పేరు పరిశీలనలో ఉండగా, ఆ కథ కూడా అల్లు అరవింద్ అంగీకారం లభించకపోవడంతో ఆ అవకాశం రవితేజకి వెళ్లిందట. ఈ రెండు సినిమాలు రవితేజ కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చాయి.
ఈ సందర్భాల్లో అల్లు అర్జున్ ఆ సినిమాలను చేసినట్లయితే, మరింత తొందరగా మాస్ ఆడియెన్స్‌లో తన స్థానం పటిష్టం చేసుకునే వీలుండేదని సినీ విశ్లేషకుల అభిప్రాయం. అయినా ఇప్పుడు ఆయన సాధించిన పాన్ ఇండియా క్రేజ్, స్టార్‌డమ్ మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.