
Ravindra Jadeja : ఐపీఎల్-2023 సీజన్ తొలి ఫైనలిస్ట్ ఎవరో దాదాపు తేలిపోయింది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఫైనల్స్‌లో అడుగు పెట్టింది. ఈ ఘనతను సాధించడం ఇది పదో సారి. 2021 సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన సీఎస్‌కే 28న ఫైనల్స్ లో ఆడబోతోంది. సీఎస్‌కే ఢీ కొట్టే జట్టు ఏదనేది ఇంకా తెలియలేదు.
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మంగళవారం రాత్రి కొనసాగిన క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌ను ధోనీ సేన నిలువరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్ కే 20 ఓవర్లల్లో 7 వికెట్ల నష్టానికి 172 రన్స్ సాధంచింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ దాన్ని ఛేదించలేకపోయింది. 157 పరుగులకే కుప్పకూలి పోయింది. 15 పరుగుల తేడాతో సీఎస్ కే విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
అయితే ఫైనల్స్ ఆడేందుకు గుజరాత్ టైటన్స్ కు మరో అవకాశం ఉంది. అదే క్వాలిఫయర్-2లో తేలిగ్గా నెగ్గాల్సి ఉంటుంది. ఈ రోజు ఎలిమినేటర్ మ్యాచ్. ఇందులో లక్నో సూపర్ జెయింట్స్ – ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. సాయంత్రం 7:30 గంటలకు చెన్నై స్టేడియంలోనే మ్యాచ్ ఉంది. ఇందులో విజయం సాధించిన జట్టుతో గుజరాత్ టైటన్స్ క్వాలిఫయర్-2 ఆడాల్సి ఉంటుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్స్‌కు చేరుకుంటుంది.
అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రవీంద్ర జడేజాకు అస్సలు పడడం లేదిన తెలుస్తోంది. జట్టుతో అతను అంటీ ముట్టనట్లు ఉంటున్నాడని, అందరితో కలిసి ఉండలేక మౌనంగా ఉంటున్నాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సీనియర్ ప్లేయర్ తో జడేజా తీవ్రంగా విభేదిస్తోన్నాడనే సోషల్ మీడియాలో ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ఆ సీనియర్ ప్లేయరే ధోని కావచ్చని పలువురు భావిస్తున్నారు.
మ్యాచ్ ముగిసిన అనంతరం పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్‌కు ముందు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో చెన్నై సూపర్ కింగ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాశీ విశ్వనాథన్ మాట్లాడారు. దీంతో అనుమాలకు మరింత బలం చేకూరింది. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్ లో పోస్ట్ కావడంతో అది వైరల్ గా మారింది. కాశీ విశ్వనాథన్ తన రెండు చేతులను రవీంద్ర జడేజా భుజాలపై ఉంచి.. ఓదార్చుతూ కనిపించారు. జడేజాకు సర్ధిచెప్తన్నట్లు, బుజ్జగిస్తున్నట్లు కనిపిస్తుంది. తరువాత కాశీ విశ్వనాథన్ జడేజాకు షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకున్నారు. పోతూ, పోతూ అతని భుజాన్ని తట్టడం కూడా కనిపించింది. దీన్ని బట్టి చూస్తే రవీంద్ర జడేజా అలిగాడనే విషయం ఇక్కడ తలుస్తోంది.
Hope he stays back and this talk between Kasi sir and #jadeja had nothing to do with his post. 🥲 #MSDhoni𓃵 #CSKvGT #csk #jaddu #anbuden #yellove #cskfans #cskticket #iplfinal #IPLPlayoff pic.twitter.com/cPOGSdmihF
— Bharat Solanki (@TedBharat) May 23, 2023