Realestate in villages :
సిటీ కంటే పల్లెటూర్లలో జనాభా తక్కువ. అందునా ఏదో ఒక చిన్న చిన్న పని చేసుకునేవారే ఎక్కువగా ఉంటారు. అన్ని సౌకర్యాలు ఉండకున్నా బతికేందుకు బాగుంటుంది. హారన్ల మోతలు, ఉరుకులు పరుగులు లేకుండా ప్రశాంతంగా మరి కొన్ని రోజులు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇదంతా కామన్ గానే తెలుసు. ఇప్పుడు అది కాదు. అక్కడ కూడా రియల్ వ్యాపారం చేయవచ్చు అంటున్నారు కొందరు రియల్టర్లు. అయితే వీరు బడా సంస్థల వారు కాదు. చిన్న చిన్న సంస్థలకు చెందిన వారు.
సిటీలోనే కాదు, పల్లె్ల్లో కూడా స్థలాలు కొనడం వల్ల అధిక లాభాలు గడించవచ్చు. మధ్య తరగతి వారు పెద్ద పెద్ద సిటీల్లో స్థలాలు కొనలేక సమీపంలోని పల్లెటూర్లలతో పాటు.. తమ సొంత గ్రామాల్లో స్థలాలు కొని పారేస్తుంటారు. రెండు నుంచి మూడు నెలల్లోనే వారు పెట్టిన రేటుకు డబుల్ త్రిబుల్ అవుతుంది. ఆ రేటుకు అమ్ముకొని సంపాదించుకోవచ్చు.
నగరాల్లో ఉన్న స్థలం ధరతో పోలిస్తే గ్రామాల్లో తక్కువగా ఉంటుంది. కాబట్టి సామాన్య, మధ్య తరగతి వారు ఈజీగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రధాన నగరంలో కొనే స్థోమత లేని వారు సమీపంలోని గ్రామల్లో కొంటే కూడా మంచి లాభమే వస్తుంది. నగరంతో పోలిస్తే పల్లెల్లో తక్కువే కానీ కొన్నడం అమ్మడంతో పోల్చుకుంటే మంచి లాభాలే ఉంటాయి. సిటీకి 30, 40 కి.మీ. సమీపంలోని గ్రామల్లో స్థలాలు కొంటే మరింత బాగుంటుంది.
ఆంధ్రప్రదేశ్ లో అమరావతి, కాకినాడ, తిరుపతి సమీపంలోని గ్రామల్లో గజం రూ. 7,500 నుంచి రూ. 11,250 మధ్యలో స్థలాలు దొరుకుతాయి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్ట్, కృష్ణాలో మచిలీపట్నం పోర్ట్, విజయనగరంలో భోగాపురం ఎయిర్ పోర్ట్ వంటి భారీ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం స్వీకారం చుట్టింది దీంతో ఆ సమీపంలోని గ్రామాల ల్యాండ్లకు రెక్కలొచ్చాయి. ఇక్కడ కొనడం వల్ల లాభం ఉంటుందా..? అనే సదేహం అవసరం లేదు ఎందుకంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది కాబట్టి లాభమే.