36.1 C
India
Thursday, April 18, 2024
More

    CM Jagan : ముందస్తుకు జగన్ వెళ్తున్నారా.. కేంద్రం హామీ ఇచ్చిందా..?

    Date:

    CM Jagan
    CM Jagan

    CM Jagan : ఏపీ సీఎం జగన్ రెండు రోజులపాటు ఢిల్లీ టూర్ లో ఉన్నారు. అక్కడ నీతి ఆయోగ్, పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ ప్రధాని మోదీ, అమిత్ షాను కలిశారు. ఆయన ఇటీవల బీజేపీతో కలిసి సాగేందుకు అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. అయితే తాజా మరో చర్చ మొదలైంది..

    ఏపీలో ముందస్తు ఎన్నికలకు అధికార వైసీపీ సిద్ధమవుతున్నదనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే సీఎం జగన్ కేంద్రం నుంచి అనుమతి పొందారని తెలుస్తున్నది. తెలంగాణ ఎన్నికలతో ఏపీలో కూడా ముందస్తుకు వెళ్లాలని ఆయన భావస్తున్నట్లు సమాచారం. అయితే మరికొంత కాలం ఆగితే ప్రభుత్వ వ్యతిరేకత కొంత పెరిగే అవకాశం ఉంటుందని, మరోవైపు పొత్తుల ద్వారా టీడీపీ, జనసేనకు సమయం ఇచ్చే అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం రాష్ర్ట ఖజానాలో చిల్లిగవ్వ లేదు. రానున్న రోజులు గడ్డు కాలమే. దీంతో వ్యతిరేకత మరింత పెరుగుతుంది. ఇది చంద్రబాబుకు అనుకూలంగా మారుతుంది. ప్రస్తుతం ఏపీలో సంక్షేమ పథకాల అమలుకే డబ్బులు సరిపోవడం లేదు. ఉద్యోగులకు సమయానికి వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఏనెలకు ఆ నెల అప్పులు తెస్తే కాని వెళ్లని పరిస్థితి. దీంతో ముందస్తుకు వెళ్తేనే బాగుంటుందని వైసీపీ భావిస్తున్నది. మరోవైపు తనకు రాజకీయ మిత్రుడైన కేసీఆర్ బాటలోనే జగన్ నడిచే అవకాశం ఉంది.

    అయితే టీడీపీ, జనసేనల మధ్య పొత్తుపై సఖ్యత కుదురుతుందా అనేది కూడా చర్చ మొదలైంది. సీట్ల సర్దుబాటు విషయాలు బెట్టు వీడకపోతే మొదటికే ముప్పు వచ్చే అవకాశం ఇరు పార్టీలకు ఉంటుంది. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న నియోజకవర్గాల నేతలు అధినేతల నిర్ణయానికి తలొగ్గుతారా అనేది కూడా అనుమానంగానే కనిపిస్తుంది. ఎలాగైనా ఈసారి పార్టీ అధికారంలోకి రావాలనే భావించే వారు తప్పా మిగతా వారు పోటీకే మొగ్గు చూపుతారు. ఇక రెబల్ గా బరిలోకి దిగితే వైసీపీకి ప్లస్ అవుతుంది. మరి ఏపీలో రానున్న కాలమంతా మూడు పార్టీలకు కీలకమే.

    Share post:

    More like this
    Related

    Vasantha Krishnaprasad : వైకాపా పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు : మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్

    Vasantha Krishnaprasad : వైసీపీ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని...

    Nominations in AP : ఏపీలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

    అభ్యర్థితో కలిపి 5గురుకి మాత్రమే అనుమతి రాజకీయ ప్రకటనలకు అనుమతి...

    KCR : కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్

    KCR React Kavitha Arrest : కవిత అరెస్టుపై తొలిసారి కెసిఆర్...

    Mango Tree : మామిడి చెట్టుకు ఒకే చోట 22 కాయలు

    Mango Tree : కరీంనగర్ జిల్లాలో ఓ మామిడిచెట్టు ఒకే కొమ్మకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan : సిఎం జగన్ పై దాడి కేసులో అప్ డేట్

    - నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు CM Jagan : సిఎం జగన్...

    Jagan Dramas : జగన్ డ్రామాలకు ఎండ్ కార్డు వేస్తామంటున్న నేతలు!  

    Jagan Dramas : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన...

    Yarlagadda-YCP : వైసీపీలో చేరిన తానా ఫౌండేషన్ మాజీ చైర్మన్ యార్లగడ్డ!

    Yarlagadda-YCP : ఎన్నికల వేళ పార్టీల్లోకి రాజకీయ నేతల వలసలు పెరుగుతున్నాయి....

    Police Statement : జగన్ పై దాడి కేసు.. పోలీసుల ప్రకటన

    Police Statement : సిఎం జగన్ పై రాయితో దాడి చేసిన...