
Comedian Sudhakar : ఈ రోజు ఉదయాన్నే ఒక వార్త ఆడియెన్స్ ను కలవరపెడుతుంది.. పొద్దుపొద్దునే ఒక రూమర్ ను విని అందరు షాక్ అయ్యారు.. ఇంతకీ ఆ చేదు వార్త ఏంటి అంటే కమెడియన్ సుధాకర్ మరణించారు అని.. అయితే ఇందులో నిజం ఎంత అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కమెడియన్ సుధాకర్.. ఈయన గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు..
ఈయన 600 పైగానే సినిమాల్లో నటించి ఇప్పటికి ప్రేక్షకుల మదిలో చెరిగిపోని స్థానం ఏర్పరుచు కున్నారు. ఒకానొక సమయంలో ఈయన తెలుగులో టాప్ కమెడియన్ గా రాణించారు.. అయితే ఈయన ముందుగా తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. వరుసగా సూపర్ హిట్ సినిమాలతో తమిళ్ ఇండస్ట్రీని ఏలాడు అనే చెప్పాలి..
అయితే సుధాకర్ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఈయన అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరం అయ్యారు.. ఇటీవలే బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో సుమారు 40 రోజుల పాటు కోమాలోనే ఉన్నారు.. ఇక ఈయన కోలుకుంటున్నారు అని అనుకుని ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.. అయితే తాజాగా ఈయన గురించి వచ్చిన వార్త అందరిని కలవర పెట్టింది..

కమెడియన్ సుధాకర్ మరణించినట్టు ఈ రోజు ఉదయం నుండి మీడియాలో జోరుగా ప్రచారం సాగింది.. దీంతో ఈ వార్త విన్న ప్రేక్షకులంతా నిజమే అని అనుకున్నారు.. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదు.. ఇది ముమ్మాటికీ అబద్ధం.. సుధాకర్ మరణించలేదు.. ఆయన క్షేమంగానే ఉన్నట్టు తెలుస్తుంది.. ఎవరో కావాలనే ఈ న్యూస్ ను స్ప్రెడ్ చేసినట్టు తెలుస్తుందో.. సో సుధాకర్ ఫ్యాన్స్ ఎంత మాత్రం బాధ పడాల్సిన అవసరం లేదనే చెప్పాలి..