Elon Musk : ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్ ప్రముఖ న్యూచ్ ఛానల్ MSNBC కొనుగోలు విషయంపై సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఛానెల్ కొనుగోలు విషయం ఇప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్ లో వైరల్ గా మారుతోంది. ఎలోన్ మస్క్ తో పాటు ‘లిబరల్ బోనాఫైడ్స్’ ఉన్న ఒకరి కంటే ఎక్కువ మంది బిలియనీర్లు ఈ ఛానల్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రముఖ న్యూస్ ఛానల్స్ చెప్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ప్రోద్బలంతో మస్క్ ఛానల్ ధరను తెలుసుకున్నాడు. అయితే MSNBC ఛానల్ మాత్రం అమ్మకానికి ఎటువంటి ప్రకటన ఇవ్వలేదని కూడా వార్తలు వస్తున్నాయి.
ఛానల్ కాంటాస్ట్ చీఫ్ బ్రియాన్ రాబర్ట్స్, అర డజను ఇతర కేబుల్ ఛానెళ్లను ప్యూర్-ప్లే కేబుల్ ప్రోగ్రామింగ్ కంపెనీ SpinCoలో కలపాలని అనుకుంటున్నారు. MSNBC కొనుగోలకు మార్క్ క్యూబన్ కూడా ఆసక్తి కనబరుస్తున్నారని ఒక న్యూస్ ఛానల్ వివరించింది. అదే విధంగా, డోనాల్డ్ ట్రంప్ జూనియర్ ‘ఎక్స్’ లో మస్క్‌ని ఆటపట్టించాడు, అతను MSNBCని కొనుగోలు చేయమని సూచించాడు, దానికి మస్క్ సరదాగా స్పందిస్తూ, ‘దీని ధర ఎంత?’ అని రీ కామెంట్ పెట్టాడు.