24 C
India
Sunday, October 11, 2026
More

    KCR : కేసీఆర్‌కు గజ్వేల్ సేఫ్ కాదేమో?

    Date:

    KCR :

    తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. దాదాపు రెండు దఫాలుగా పాలించిన ఆయనను ప్రజలు వద్దునుకుంటున్నట్లు ఇటీవల నిర్వహించిన సర్వేలు పేర్కొంటున్నాయి. మొదటి సారి సెంటిమెంట్ బేస్ చేసుకొని సీఎం పీఠం ఎక్కిన ఆయన తర్వాత బీజేపీ, కాంగ్రెస్ సరైన పోటీ ఇవ్వకపోవడంతో గెలిచారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. దాదాపు మూడేళ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అయితే గతంలో ఇవి బీజేపీకి అనుకూలంగా ఉంటే, కర్ణాటక గెలుపుతో కాంగ్రెస్ కు అనుకూలంగా మారాయి.

    తెలంగాణ రాజకీయాలు కొన్ని నెలల్లో మారబోతున్నాయి. ఏ పార్టీ గెలుస్తుందో.. ఏ పార్టీ ఓడుతుందో ప్రస్తుతం చెప్పడం కొంచెం కష్టమే అయినా విశ్లేషకులు మాత్రం గతంలో కంటే ఈ సారి బీఆర్ఎస్ కు చాలా సీట్లు తగ్గుతాయని మాత్రం చెప్తున్నారు. ఇక గెలిచిన తర్వాత ఆయా పార్టీల అలయన్స్ నేపథ్యంలో ఏది సీఎం పీఠం అధిరోహిస్తుందో తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ మంచి ఊపుమీద ఉంది. ఇదే ఊపు ఎన్నికల గడువు వరకు కొనసాగితే కష్టమని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎన్నికల కంటే ముందే అసెంబ్లీని డిసాల్వ్ చేయాలని చూస్తున్నాడని కొన్ని సంకేతాలు వినిపిస్తున్నాయి.

    ఇప్పటి వరకు ఏకఛత్రాదిపత్యంగా గజ్వేల్ నియోజకవర్గం నుంచి గెలుస్తున్న కేసీఆర్ కు ఈ సారి ఆ నియోజకవర్గం అంత సేఫ్ కాదని చాలా మంది అంచనా వేస్తున్నారు. బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా ఇదే మాటను చెప్పారు. బహూషా కేసీఆర్ కు ఈ సారి గజ్వేల్ కలిసిరాదని చెప్పారు. ఆయన అక్కడి నుంచి పోటీ చేయకపోవడమే మంచిదిని అభిప్రాయ పడ్డారు. ఇటీవల అక్కడ శివాజీ విగ్రహం ధ్వంసం చేయడంతో తీవ్ర అల్లర్లు చెలరేగాయి. అక్కడి ప్రజలు రెండు వర్గాలుగా విడిపోవడంతో అల్లర్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు అక్కడ అసంతృప్తి పెరిగిందని కొండా అన్నారు. కేసీఆర్ గజ్వేల్ నుంచే పోటీ చేయాలని ఇటు రేవంత్, అటు ఈటల సవాల్ కూడా చేసినట్లు గుర్తు చేశారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR : అసెంబ్లీలో కేసీఆర్.. అరుదైన సీన్

    KCR : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు....

    KCR : 19న ఫామ్‌హౌస్ నుంచి బయటకు కేసీఆర్ !

    KCR : భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మళ్లీ రాజకీయాల్లో...

    KCR : నేను కొడితే మామూలుగా ఉండదు.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

    KCR : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర...

    KTR Padhayatra: కేటీఆర్ పాదయాత్ర సక్సెస్ అవుతుందా… ఇప్పుడు చేయడానికి కారణం ఏంటో తెలుసా

    KTR Padhayatra: మాజీ మంత్రి కేటీఆర్ త్వరలోనే పాదయాత్ర చేయబోతున్నానని ప్రకటించారు....