
Anupama : తమిళ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. స్పాటిఫైలో వీరిద్దరి పేరిట ‘బ్లూ మూన్’ అనే ప్లే లిస్ట్ కనిపించడం, వారు ముద్దు పెట్టుకున్నట్లుగా ప్రొఫైల్ పిక్చర్ ఉండడంతో డేటింగ్ వార్తలు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘బిసన్’ అనే సినిమా చేస్తున్నారు. దాని ప్రమోషన్ కోసమే ఇలా చేసి ఉంటారని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.