Injustice : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. చట్టాన్ని గౌరవించే నాయకుడిగా చంద్రబాబుకు మచ్చలేని నాయకుడిగా పేరుంది. భాగ్యనగరం రూపురేఖల్ని మార్చడంలో, ఏపీలో అమరావతి నిర్మాణంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. అలాంటి నేతలను అకారణంగా జైల్లో పెట్టడం విమర్శలకు దారి తీస్తోంది.
ఎలాంటి అవినీతి మకిలీ పట్టని నేతగా చంద్రబాబు ఇప్పటికి సచ్చీలుడే. కానీ ఆయన రాజకీయ జీవితాన్ని అవినీతిమయంతో కూడినదని నిరూపించే దిశగా వైసీపీ చేస్తున్న కుట్రకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే తన తల్లికి గుండెపోటు అంటూ బెయిల్ తెచ్చుకుని బయట తిరుగుతున్న వైనంపై విమర్శలు పెరుగుతున్నాయి.
వారికి అనుకూలంగా ఉంటే ఏదైనా సాధ్యమే. విరుద్ధంగా ఉంటే న్యాయంగా ఉండే వారిని సైతం అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తుంటారు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత అయిన చంద్రబాబు బెయిల్ కోసం న్యాయమూర్తి ఎదుట చేతులు చాచడం వంటి చర్యలను చూసి అందరు కళ్లు చెమర్చుతున్నారు. బాబుకు ఇంతటి దుర్గతి పట్టించిన వారికి కచ్చితంగా శాస్తి జరుగుతుందని అంటున్నారు.
ఏపీలో అన్యాయమే రాజ్యమేలుతోంది. వారు అనుకున్నది చేయడానికి వెనకాడటం లేదు. అది న్యాయమా? అన్యాయమా? అని చూడటం లేదు. తమకు వ్యతిరేకంగా మాట్లాడేవారి నోరు మూయించేందుకే కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబుపై కుట్రతోనే కేసులు పెట్టి లోపల వేయించడం గమనార్హం. దీనిపై వైసీపీకి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమే అని అంటున్నారు.