Chandrababu Bail : అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు అలైన్ మెంట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో బాబు తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పిటిషన్ పై విచారణను ఈనెల 26కు హైకోర్టు వాయిదా వేసింది. చంద్రబాబును శాశ్వతంగా జైల్లో ఉంచాలనే దురద్దేశంతోనే వైసీపీ పలు కేసులు తిరగదోడుతోంది. దీంతో బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు పలు మార్గాలు వెతుకుతోందని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
చంద్రబాబును కస్టడీకి అప్పగించాలని ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ తో ాటు బెయిల్, మధ్యంతర బెయిల్ కోరుతూ బాబు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు పూర్తి చేసింది. దీంతో ఈ రోజు ఉదయం 11 గంటలకు తీర్పు రావాల్సి ఉంది. సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు వస్తుందని అనుకున్నారు. కానీ ఐదు రోజుల పాటు సీఐడీ కస్టడీకి కోరడంతో ఆయనను కస్టడీకి అప్పగించేందుకే కోర్టు నిర్ణయించింది.
మరోవైపు అంగళ్లులో జరిగిన అల్లర్ల కేసులో కూడా బాబు ముందస్తు బెయిల్ పై విచారణ ఈ రోజు జరగనుంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ పూర్తయింది. తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది. ఈ రోజు లేదా రేపు తీర్పు వెలువడే అవకాశం ఉంది. దీంతో చంద్రబాబును జైల్లోనే ఉంచే కుట్ర జరుగుతోందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు బాబును బయటకు తీసుకురావాలని నారా లోకేష్ విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కుదరడం లేదు. దీంతో బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. కేసులు కోర్టు పరిధిలోనే ఉండటంతో బాబు కస్టడీలోనే ఉండాల్సి వచ్చింది. ఒక కేసు పోయి రెండు మూడు కేసులు వచ్చాయి. దీంతో బాబును ఇప్పట్లో బయటకు రాకుండా చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.