
Dreams : కలలు సర్వ సాధారణం. వీటిపై కొన్ని థియరీలు ఉన్నాయి. మరికొన్నింటి గురించి పెద్దలు వివరిస్తారు. కలల గురించి ప్రత్యేకింత స్వప్న శాస్త్రం కూడా ఉంది. చాలా వరకు కలలు ఎలా వస్తాయి? మనం నిద్రించేప్పుడు ఆలోచించిన విషయాలు, లేదంటే ఆ రోజులో మానం చూసినవి మళ్లీ, మళ్లీ గుర్తుకు వచ్చేవి ఉంటాయి.
కొంత మందికి జీవితం, కుటుంబం, ఉద్యోగం తల్లిదండ్రులు లేదంటే స్కూల్, కాలేజీ వీటికి సంబంధించినవి వస్తాయి. కొంత మంది ప్రేమ, సంబంధాలు ఇంకా వివాహం మొదలైన వాటిని కల కంటారు.
స్వప్న శాస్త్రం ప్రకారం.. కలలు ఒక వ్యక్తిని భవిష్యత్తుతో అను సంధానం చేస్తాయి. దాని అర్థం తెలుసుకోవడం అవసరం. కలలో పార్ట్నర్ తో లైంగిక సంబంధం గురించి శుభ, అశుభాల గురించి తెలుసుకుందాం.
ఈ శాస్త్రం ప్రకారం.. మీరు కలలో మీ మాజీతో లైంగికంగా కనిపిస్తే మీరు వారిని ఇంకా మరచిపోలేదని అర్ధం. ఎక్కడో మీకు వారితో కొన్ని మెమోరీస్ గుర్తుకు వస్తున్నాయని అర్థం. బహుశా ఇలా వస్తే మీకు మీ ఎక్స్ తో కనెక్ట్ అవ్వాలనే కోరిక ఉందని అనుకోవచ్చు. మీ బంధాన్ని కొనసాగించాలని ఆశిస్తున్నట్లు దీని అర్థం.
మాజీతో లైంగికంగా కలిసినట్లు కలవస్తే.. మీరు మీ జీవిత భాగస్వామితో సుఖంగా లేరని అంటుంది స్వప్న శాస్త్రం. అటువంటి సమయంలో పశ్చాత్తాపం పడతారని పండితులు అంటున్నారు. అయితే ఇది మీ వివాహ జీవితానికి మంచిది కాదని. ఇది పెరిగితే దంపతుల మధ్య గొడవలు వస్తాయని స్వప్న శాస్త్రం అంటోంది.
ఇక డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మీరు మీ భాగస్వామితో లైంగికంగా కలిసినట్లు కల రావడం శుభ సూచికం అట. ఇలా కల వస్తే మీ భాగస్వామితో మీ సంబంధం మరింత ధృడంగా ఉంటుంది. ఇరువురి మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుందంట.
ఇద్దరి మధ్యా శృంగారం పెరుగుతుంది.. ఇది వైవాహిక జీవితాన్ని మరింత పటిష్టం చస్తుంది. కొత్తగా వివాహమైన జంటలకు ఈ కల వస్తే మీ ఇంటికి త్వరలో బుల్లి అతిథి రాబోతున్నాడని సంకేతం అట.
వివాహితుల కలలో అపరిచితులతో లైంగికంగా కలిసినట్లు కల వస్తే మీరు ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారని సంకేతం అట. ఎక్కడో మీ పార్ట్నర్ తో సంతోషంగా లేరని జీవితంలో ప్రేమ, శృంగారం కోరుకుంటున్నారని దీని అర్థం.
అదే పెళ్లికాని వ్యక్తులకు అపరిచితుడితో లైంగికంగా కలిసినట్లు కల వస్తే.. మీరు త్వరలో శుభవార్త వినబోతారని ఇది సూచిస్తుంది. వివాహం కావచ్చు, సరైన ఏజ్ లేకుంటే ప్రేమలో కూడా పడవచ్చు.
(గమనిక: ఈ సమాచారం కొంత మంది జ్యోతిష్యుల నుంచి తీసుకున్నది)