KCR : ప్రత్యేక రాష్ర్ట సాధన ఉద్యమ సమయలో తెలంగాణ యువతను జాగృతం చేయడంలో కేసీఆర్ పాత్ర కీలకం. యువత ఉవ్వెత్తున్న ఉద్యమంలో పాల్గొనేలా చేయడంలో కేసీఆర్ ఉపన్యాసాలు స్పూర్తిని రగిల్చాయి. ఉద్యమం సాగిందే ఇక్కడి యువత కు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం. అలాంటి యువతను కేసీఆర్ దూరం చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
యువతకు ముందుగా కావాల్సింది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. ఈ రెండింటిని అందించడంలో కేసీఆర్ విఫలమయ్యాడు. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీ నిరుద్యోగ భృతి. ఉద్యోగాలను భర్తీ చేయడంలోనే కాదు పరీక్షల నిర్వహణలోనూ కేసీఆర్ ప్రభుత్వం ఫెయిలైంది. చివరకు నిరుద్యోగ భృతి కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైన విషయం స్పష్టమవుతున్నది.
ఉద్యోగాల భర్తీ కోసమే ఏర్పాటుచేసిన టీఎస్సీఎస్సీ ముందు నంచీ వివాదాలకు కేంద్రబిందువవుతున్నది.
విభసన సమస్యల సాకు.. మొదటి సారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై పెద్ద దృష్టి సారించలేదు. దీనికి సీఎం కేసీఆర్ అనేక కారణాలు చూపారు. రికార్డులు పూర్తిగా అందుబాటులో లేవని, శాఖలు విభజన కాకపోవడం, ఉద్యోగుల విభజన ఆలస్యం కావడం తదితర కారణాలను సీఎం కేసీఆర్ చూపారు. అయితే ఇవి వాస్తవాలే అనే ఉద్దేశంతో యువత తమ కొపాన్ని తగ్గించుకుంది.

రెండో సారి అదే పరిస్థితి..
రెండోసారి అధికారం చేజిక్కుంచుకున్న కేసీఆర్ అదే పరిస్థతిని కొనసాగించారు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నోటిఫికేషన్లు ఇచ్చారనే అపవాదు మూటగట్టుకున్నారు. అయితే పేపర్ల లీకేజీతో ప్రభుత్వ తీరుపై యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోచింగ్ తీసుకుంటున్న తమను కేసీఆర్ మోసం చేశారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఏళ్లకు ఏళ్లుగా ఇల్లు, ఊరు విడిచి హైదరాబాద్ కు చేరుకొని అప్పోసప్పో చేసి శిక్షణ తీసుకొని ఉద్యోగాలకు సిద్ధమవుతుంటే పేపర్ల లీకేజీతో నిరుద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. ఏ విధంగా చూసినా ఈసారి బీఆర్ఎస్ కు నిరుద్యోగుల ఆగ్రహ జ్వాలలు అంటుకునేలా కనిపిస్తున్నాయి.