29.3 C
India
Tuesday, February 10, 2026
More

    KCR silence : బీజేపీపై కేసీఆర్ మౌనం వ్యుహామా.. ఒప్పందమా?  

    Date:

    KCR silence
    KCR silence

    KCR silence : తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యుహాలు ఎవరికీ అంతుచిక్కవు. ప్రతిపక్ష పార్టీలపై కేసీఆర్ వేసే సెటైర్లు మామూలుగా ఉండవు. అయితే తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే.  బహిరంగ సభలు, సమావేశాల్లో ఏ చిన్న అవకాశం దొరికినా బీజేపీ పై విరుచుకుపడే సీఎం కేసీఆర్ ఆ పార్టీ ఊసే ఎత్తడం లేదు.

    సీఎం కేసీఆర్ ఇటీవల జిల్లాల్లో పర్యటించి కొత్త పథకాలు, కొత్త కలెక్టరేట్లు ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లోనూ మాట్లాడారు. ఒక్కసారి కూడా ఆయా కార్యక్రమాల్లో బీజేపీ పేరెత్తకుండా ప్రసంగాలు పూర్తి చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ గత పరిపాలన విధానాలను ఎండగట్టారు. అయితే కేసీఆర్ ప్రసంగాలపై వివిధ పార్టీల నాయకులు, విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. ఒక్కసారిగా కేసీఆర్ లో ఈ మార్పేమిటని అనుమానాలు వ్యక్తం చేస్తు్న్నారు. అయితే బీజేపీ నాయకులు మాత్రం తమ పార్టీ పేరెత్తలేదని బాగా ఫీలవుతున్నారట. బీజేపీ ప్రస్తావన తెస్తే తాము కూడా ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు ఇచ్చవాళ్లమని లోలోపల గొణుక్కుంటున్నారట. కానీ పైకి ఏమీ అనలేకపోతున్నారు బీజేపీ నాయకులు.

    హైప్ ఇచ్చి.. పట్టించుకోవడం లేదు..

    తెలంగాణలో బీజేపీకి మైలేజ్ రావడానికి కారణం కేసీఆర్. బీజేపీనే తమ ప్రధాన ప్రత్యర్థి అనే భావనను ఎక్స్పోజ్ చేశారు. అదే పనిగా టార్గెట్ చేసి  కమలం పార్టీపై విమర్శలు గుప్పించారు. దీంతో రాష్ర్టంలో అధికార, ప్రతిపక్ష పార్టీలుగా బీఆర్ఎస్, బీజేపీ అనే భావవ ఏర్పడింది. ప్రధానంగా పోటీ ఈ రెండు పార్టీల మధ్యే ఉంటుందనే స్థాయికి తెచ్చారు.  కాంగ్రెస్ ను మూడో పక్షంగా  మారిపోయింది.

    రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతుంటే కాంగ్రెస్ ను మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. బీజేపీ కి హైప్ ఇవ్వడంలో కేసీఆర్ పాత్ర ఉందని రాజకీయ వర్గాల్లో టాక్. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. బీజేపీపై యుద్ధం ప్రకటించి ఆ పార్టీ పేరెత్తడం లేదు. ఓ వైపు బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందాలని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నది. దీంతో కాషాయం పార్టీలో చేరికలు లేకుండా పోయాయి. ఎన్నికలకు ముందు కమలం పార్టీని పట్టించుకోకపోవడంతో ఇప్పటి వరకూ వచ్చిన హైప్ అంతా కరిగిపోతున్నట్లుగా మారుతున్నది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Political Love Triangle : తెలంగాణ ఎన్నికల్లో ట్రయాంగిల్ లవ్ డ్రామా.. 

    Political Love Triangle : మొదట్లో బాగా దూకుడుగా ఉన్న బీజేపీ...

    Boss To Change Strategy : పస తగ్గిన ప్రసంగాలు.. స్ట్రాటజీ మార్చాల్సిందేనని బాస్ కు వినతులు

    Boss To Change Strategy : ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు...

    CM KCR Strategy : తెలంగాణ అంటే కేసీఆర్.. పక్కా వ్యూహంతో బరిలోకి

    CM KCR Strategy : తెలంగాణలో ఎన్నికలకు మరో 44 రోజుల...

    BRS Three Plans : గెలుపు కోసం బీఆర్ఎస్ త్రిముఖ వ్యూహం ఫలిస్తుందా?

    BRS Three Plans : తెలంగాణలో ఎన్నికల వేళ వాతావరణం  వేడెక్కుతోంది....