
Pawan voice : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్నాళ్లుగా బీజేపీతో దోస్తీ చేస్తున్నారు. ఏపీలో ఆయనతో కలిసి నడిచేందుకు బీజేపీ అగ్రనేతలు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే కొంతకాలంగా బీజేపీ తీరు పవన్ దృష్టిలో మార్పునకు కారణమవుతున్నట్లు తెలుస్తున్నది. అయితే ఆయన గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓ కార్యక్రమానికి వస్తున్నట్లు సమాచారం. ఇక్కడే ఆయన పొత్తులపై కీలక ప్రకటన చేయబోతున్నారని తెలిసింది.
జనసేనాని పవన్ కళ్యాణ్ ముందు నుంచి వైసీపీకి వ్యతిరేకంగా వెళ్తున్నారు. అయితే ఇటీవల కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు పవన్ అగ్రహానికి కారణంగా తెలుస్తున్నది. వైసీపీ ముందు నుంచి రాష్ర్ట ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే ఇటీవల అదే నిజమని తేలిందని జన సైనికులు అంటున్నారు. వైసీపీ రాష్ర్ట ప్రయోజనాలను తాకట్టు పెట్టి రూ. 10 వేల కోట్లను తెచ్చిందని సమాచారం. దీనికి కేంద్రం సహకరించడం పవన్ అగ్రహానికి కారణమైంది.
వైపీసీ అమరావతిని ధ్వంసం చేస్తున్నది. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నది. పరిశ్రమలు రావడం లేదు. శాంతిభద్రతల సమస్యలు రాష్ర్ట వ్యాప్తంగా తలెత్తుతున్నాయని వవన్ భావస్తున్నారని సమాచారం. దీనికి ప్రధాన కారణమైన జగన్ కు బీజేపీ వంత పాడడం ఆయనకు నచ్చడం లేదు. ఇన్నాళ్లు పవన్ బీజేపీతో పొత్తు అంశం పై ముందుకెళ్తుంటే, కేంద్రంలోని బీజేపీ మాత్రం వైసీపీకి మంచి చేసేలా ప్రవర్తించడం పవన్ కోపానికి కారణమని తెలుస్తున్నది.
అయితే మరోవైపు పొత్తు అంశంపై త్వరగా తేల్చాలని ఆయన బీజేపీ పెద్దలకు ఆల్టిమేటం జారీ చేసే అవకాశం ఉందని అంతా అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని, ఇక తాత్సారం మంచిది కాదనే భావనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తు ఖాయమని ప్రజల్లోకి బలంగా వెళ్లిందని బీజేపీని, కలిసి వచ్చే ఇతర పార్టీలను కూడా త్వరగా తేల్చుకోవాలని కోరుతున్నారు. మరి పవన్ స్పీడ్ ను బీజేపీ అగ్ర నేతలు ఎలా తీసుకుంటారో చూడాలి.