Pawan Kalyan : పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి పదేళ్లు అయ్యింది. ఈలోపల 2014, 2019 ఎన్నికలు గడిచిపోయాయి. 2024 ఎన్నికలు వచ్చేశాయి. తనను గెలిపిస్తే మార్పు చేసి చూపిస్తానని ఆయన అంటున్నారు. అసలు ఏ మార్పు తీసుకొస్తారు? అది ఆయనతో ఎలా సాధ్యమవుతుందనే చర్చ జనాల్లో నడుస్తోంది.
జనసేనకు ఇచ్చిందే 24 సీట్లు. అందులో ఎన్నింటిలో గెలుస్తారో తెలియదు. అలాంటప్పుడు ఆయన సీఎం ఎలా అవుతారు? రాజకీయాలను, రాష్ట్రాన్ని ఎలా మారుస్తారు? అనే సందేహాలు వస్తున్నాయి. గత పదేళ్లుగా ఆయన మార్పు చేస్తా అని అంటున్నారు. ఆయన సీఎం కానప్పుడు మార్పు ఎలా తీసుకొస్తారు. ఒకవేళ కూటమి అధికారంలోకి వచ్చినా.. చంద్రబాబు విధానాలు, ఆయన హామీలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది తప్పా.. పవన్ చెప్పే ‘మార్పు’తో చంద్రబాబుకు సంబంధం ఉంటుందా? అని విశ్లేషకులు అంటున్నారు.
తాను అధికారంలోకి వస్తే రాష్ట్ర యువతకు ఉద్యోగాలు ఇస్తానని అంటున్నారు. అలాగే అమరావతిలో సాఫ్ట్ వేర్ కంపెనీలు తెస్తామంటున్నారు. ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి. అమరావతి రాజధాని నిర్మాణం హైదరాబాద్ కు దీటుగా జరుగాలంటేనే మరో 25,30 ఏండ్లు కావాలి. అప్పటిదాక ఇప్పటి యువకులు నిరీక్షిస్తారా? అప్పటికీ వారికి 50 ఏండ్లు వస్తాయి. అప్పటిదాక జాబ్ లు చేయకుండానే ఉండాలా?
ఇక ప్రభుత్వ ఉద్యోగాల విషయానికొస్తే.. ఎంత మందికి ఉద్యోగం ఇస్తారు. ఇప్పటికే ఏడాదికి ఉద్యోగుల జీతాలు 90 వేలు కోట్లు ఇస్తున్నారు. రాష్ట్రం ఇంతటి దుర్లభ పరిస్థితిలో ఉంటే వేలకు వేలు ఉద్యోగాలు ఎలా ఇస్తారు? ఇవన్నీ ఆచరణ సాధ్యమవుతాయా? అని జనాలు చర్చించుకుంటున్నారు. అసలు తాను తెచ్చే మార్పు ఏంటో..తమ కూటమి అధికారంలోకి వచ్చిన ఈ మార్పును ఎలా తెస్తారో పవనే చెప్పాల్సి ఉంది.