31.1 C
India
Wednesday, April 24, 2024
More

    Poor to Rich : ‘పూర్ టు రిచ్’ ఏపీలో సాధ్యమేనా.. చంద్రబాబు చేయగలడా..?

    Date:

    Poor to Rich
    Poor to Rich

    Poor to Rich : ఏపీలో ఎన్నికలకు మరో పది నెలల గడువే మిగిలి ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. అధికార వైసీపీలో గెలుపు ధీమా నిండుగా కనిపిస్తున్నది. దేశంలో ఎక్కడా అమలు కాని పథకాలను వైఎస్ జగన్ ఏపీలో అమలు చేస్తున్నారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని మరింతగా అక్కడ పథకాలను ప్రవేశ పెడుతున్నారు. అయితే ఈ పథకాలే తమను గెలిపిస్తాయని సీఎం జగన్ తో సహా వైసీపీ శ్రేణులంతా భావిస్తున్నారు. రాష్ర్ట అభివృద్ధిని పట్టించుకోని ప్రజలు కేవలం సంక్షేమ పథకాల వైపే మొగ్గు చూపుతారని వారు భావిస్తున్నారు.

    అయితే ఇక ఏపీలో ప్రధాన పక్షం కూడా సంక్షేమ పథకాల వైపే దృష్టి ఉంటుంది. 2024 తాము అధికారంలోకి వస్తే వైసీపీ కంటే ఎక్కువగానే ఇస్తామని చెబుతున్నది. రాజమండ్రిలో మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించిన పథకాలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నది. అయితే ఇక్కడ చంద్రబాబు మరో కొత్త ప్రకటన ద్వారా ప్రజల్లో చర్చకు తెరలేపారు. పూర్ టు రిచ్ అనే కార్యక్రమం గురించే ఇప్పుడు చర్చ సాగుతున్నది. అయితే గతంలోనూ చంద్రబాబు పలు పథకాలతో ప్రజల్లోకి వెళ్లారు. కానీ అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోలేదన్న ఆపవాదు మూటగట్టకున్నారు.

    మరి ఈసారి పూర్ టూ రిచ్ కార్యక్రమం కూడా వంచనకేనని మాటలు వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పీ4 ట్యాగ్ లైన్ తో దీనిని అమలు చేస్తామని టీడీపీ చెబుతున్నది. కేవలం జగన్ ను ఓడించే లక్ష్యంతోనే అయితే ఈ హామీని నెరవేర్చడం ఏపీలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అసాధ్యమే. నిధుల కొరతతో సంక్షేమ పథకాల అమలే కష్టసాధ్యంగా ఉంది. మరి పూర్ టూ రిచ్ కార్యక్రమం సత్ఫలితాలను ఇవ్వగలదా.. నిధులు లేవనే సాకుతో పథకాలను పక్కనే పెట్టేస్తే మరో ఐదేళ్లకు గండం ఉండనే ఉంటుంది.

    ఆచరణ సాధ్యం కాని పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను మభ్య పెట్టే కంటే అభివృద్ధి గళమెత్తి ప్రజలను చైతన్యం చేస్తే బాగుండేదని సామాజిక, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు లాంటి సీనియర్ నేత కూడా ఇలా సంక్షేమ పథకాలతో రాష్ర్టాన్ని దివాళా దశకు తీసుకెళ్లడం భావ్యం కాదని చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Cognizant CEO : కాగ్నిజెంట్ సీఈవో జీతం రోజుకు రూ.50 లక్షలు

    Cognizant CEO : ఐటీ రంగంలో ఉద్యోగులకు వార్షిక వేతనాలు ఎక్కువగానే...

    English Day : పరభాషా జ్ఞానాన్ని సంపాదించు.. నీ భాషలోనె నువ్వు సంభాషించు..!

    ఇంగ్లీష్ డే బ్రిటిషోడు మనకిచ్చిన ఓ వరం..అదే శాపం.. ఇంగ్లీష్.. మనం వెటకారంగా పిలుచుకునే ఎంగిలిపీసు.. గాడిద గుడ్డు...

    Pushpa-2 : పుష్ప-2 నుంచి అప్ డేట్

    Pushpa-2 : ‘పుష్ప-2’ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీంతో...

    Pandikona Wild Dog : క్రూరమృగాలను కూడా చీల్చిచెండాడే ‘పందికోన వైల్డ్ డాగ్’ ఇదే..

    Pandikona Wild Dog : శునకాలను గ్రామ సింహాలని వ్యవహరిస్తాం. శునకాల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో  పసుపు వనం

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గద్దె దించడానికి జనసేన,తెలుగుదేశం,బీజేపీ...

    Nara Brahmani : మహళల కోసమే సూపర్-6 పథకాలు: నారా బ్రాహ్మణి

    Nara Brahmani : మహిళలను ఆదుకునేందుకే సూపర్-6 పథకాలు అని నారా...

    Election Commission : ఎన్నికల కమిషన్ ఎవరికీ చుట్టం ????

    Election Commission : ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల...