22.3 C
India
Sunday, September 13, 2026
More

    Property Rights : పిల్లలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు?

    Date:

    Property Rights
    Property Rights

    property rights : తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ నైతిక, చట్టపరమైన బాధ్యతగా పేర్కొంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులను చూసుకోవ డం పిల్లల నైతిక బాధ్యత మాత్రమే కాదు,న్యాయప రమైన బాధ్యత కూడా అని సుప్రీంకోర్టు తాజా నిర్ణయం లో పునరుద్ఘాటించింది

    తల్లిదండ్రులను కాపాడు కోవడం ఆర్థిక బాధ్యత మాత్రమే కాదు, సామాజిక,నైతిక బాధ్యత అని,దానిని నెరవేర్చడం పిల్లల బాధ్యత అని కోర్టు పేర్కొంది.ఆ బాధ్యతను విస్మరించిన కూతురు, కుమారులకు తల్లిదండ్రుల ఆస్తిని పొందే హక్కు లేదని కోర్టు తేల్చి చెప్పింది

    వృద్ధాప్యంలో అమ్మా నాన్నల బాగోగులన్నీ చూసుకుంటానని హామీనిచ్చి,వారి నుంచి ఆస్తి పొందిన కుమారుడు ఇచ్చిన మాట తప్పడంతో ఓ కన్న తల్లి కోర్టును ఆశ్రయించింది

    ఈ కేసును విచారించిన జస్టిస్‌ సి.టి.రవికుమార్, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ ధర్మాసనం.. ఆ కుమారు డికి ఇచ్చిన గిఫ్ట్‌ డీడ్‌ను రద్దు చేసింది.అనంతరం ఆస్తిపై వృద్ధుల హక్కును పునరుద్ధరించింది

    ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. బిడ్డల నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రులకు 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన ‘తల్లిదండ్రుల,వృద్ధుల సంరక్షణ,పోషణ చట్టం’ అండగా నిలుస్తుం దంటూ పేర్కొంది

    ఈ చట్టం ప్రకారం ఏర్పాటైన ట్రైబ్యునళ్లు.. కన్నవారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన బిడ్డల విషయంలో సత్వర విచారణ జరుపుతాయని పేర్కొంది.ఇలాంటి వివాదాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చిన ఆస్తిపై యాజమాన్య హక్కులు తిరిగి వాళ్లకే దక్కేలా ఆదేశించే అధికారం ఆ ట్రైబ్యునళ్లకు ఉంటుందని న్యాయస్థానం స్పష్టంచేసింది.

    తద్వారా వృద్ధులైన తల్లి దండ్రులకు ఆర్థికపరమైన భరోసా లభిస్తుందని పేర్కొంది.మిగిలిన ఆస్తిని కూడా ఇచ్చేయాలంటూ తమపై కన్న కొడుకే నిద్రాక్షి ణ్యంగా దాడి చేస్తున్నా డంటూ మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తార్‌పుర్‌కు చెందిన ఓ మహిళ న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు

    అతనికి అప్పటికే గిఫ్ట్‌ డీడ్‌గా కొంత ఆస్తిని ఇచ్చామని చెప్పుకొచ్చారు. ప్రేమ, ఆప్యాయతలు కనుమరుగైన పరిస్థితుల్లో ఆ గిఫ్ట్‌ డీడ్‌ను రద్దు చేసి ఆస్తిపై తమ హక్కును పునరుద్ధరించాలని ఆమె న్యాయస్థానాన్ని వేడుకుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Age of 35 ఏళ్లు దాటితే సంతానం పొందడం కష్టమే!

    Age of 35 : నేటి ఆధునిక జీవనశైలిలో చాలా మంది...

    Marriages : పెళ్లి చేసుకోమంటున్న యువతులు.. కారణం తెలిస్తే  షాక్

    Marriages :  మోర్గాన్ స్టాన్ టి అనే సంస్థ నిర్వహించిన ఒక...

    Girls Mind : మీ అమ్మాయి మనసు మీకు తెలుసా?

    Girls Mind : మగబిడ్డ పుట్టినందుకు కుటుంబాలు సంబరాలు చేసుకుంటాయి. అదే...

    Father died : పిల్లల అల్లరి మాన్పించే యత్నం.. ఉరి బిగుసుకుని తండ్రి మృతి

    Father died  : పిల్లల అల్లరిని మాన్పించడానికి ఓ తండ్రి చేసిన...