32.3 C
India
Wednesday, April 17, 2024
More

    రజనీకాంత్ పిలుపు వ్యూహాత్మకమా..!

    Date:

    Rajinikanth-CBN
    Rajinikanth-CBN
    తమిళనాట స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ ను టిడిపి నేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఆహ్వానించాడు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ రజినీకాంత్ చంద్రబాబు నాయుడు తనకు 30 ఏళ్ల స్నేహితుడని.. అదే సందర్భంలో తన విజన్ ను పొగిడారు.. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు సీఎంగా గెలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం  దేశంలోనే నెంబర్ వన్ గా అవుతుందని చెప్పారు. దీంతో వైసిపి నేతలు రాజు గారి పెద్ద కోడలు మంచిది.. అంటే చిన్న కోడలు మంచిది కాదని డైరెక్ట్ గా చెప్పనక్కర్లేదని… పరోక్షంగా జగన్ ను విమర్శించారని రజనీకాంత్ పై వైసిపి నేతలు విమర్శలు గుప్పించారు. ఇంకెవరు వైసీపీని విమర్శించకుండా రజనీకాంత్ ను  సూపర్ స్టార్ అయినప్పటికీ వదలకుండా తన వ్యక్తిగత విషయాలపై కూడా విమర్శల వర్షం కురిపించారు. రజనీకాంత్ ఎక్కడా వివాదాస్పద అంశాల జోలికి వెళ్లలేదు. ముఖ్యంగా ఏపీ రాజకీయాల జోలికి అసలు  వెళ్లలేదని టిడిపి నాయకులు చెప్తున్నారు..
     అనుకున్నదొక్కటి.. అయ్యింది ఇంకొకటి..
    రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు రజనీకాంత్ను పిలిపించాడని.. తన ద్వారా కొన్ని ఓట్లు రాబట్టుకోవచ్చని తనను ఈ వేడుకలకు పిలిచారని కొంతమంది గుసగుసలాడుకుంటున్నారు. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్  చంద్రబాబు నాయుడు ను పొగడడమే తప్పు అన్నట్లుగా..ప్రత్యక్షంగా వైసీపీని గాని తమ పరిపాలన గురించి గానీ పథకాల గురించి గానీ విమర్శించకపోయినప్పటికీ పరోక్షంగా విమర్శించారని అందుకే మేము విమర్శించామని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.
     టిడిపి పొగడ్తను సహించని వైసీపీ..
    సూపర్ స్టార్ రజినీకాంత్ అప్పటి చంద్రబాబు పాలనను పొగడడాన్ని జీర్ణించుకోలేని వైసిపి నేతలు రజనీకాంత్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ విరుచుకుపడ్డారు. భవిష్యత్తులో ఎవరైనా వైసీపీని విమర్శిస్తే వారి పరిస్థితి కూడా ఇలానే ఉంటుందని విమర్శల ద్వారా చెప్పకనే చెప్పినట్లు అయింది.
    ఏది ఏమైనప్పటికీ  చంద్రబాబు నాయుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ను తన రాజకీయ లబ్ధి కోసమే రప్పించాడని భావించిన వైసీపీ నేతలు రజనీకాంత్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎంతో పేరు ఉన్న రజినీకాంత్ ను  విమర్శించడం.. ఏంటని అభిమానులు తెగ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను విమర్శించకపోయినప్పటికీ ఇంత స్థాయిలో  విమర్శించడం వైసిపి దిగజారుడకు నిదర్శనమని సామాజిక మాధ్యమాల్లో తిట్టిపోస్తున్నారు . పార్టీలను పక్కన పెడితే ఒక మనిషిని అభిమానించే వాళ్ళు పొగిడే వాళ్లు చాలా ఉంటారని దాని రాజకీయ కోణంలో చూసి రజనీకాంత్ పై విమర్శలు చేయడం సరికాదని  రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Kadiyam Srihari : కమీషన్లు తీసుకున్నట్లు నిరూపిస్తే.. రాజీనామా చేస్తా : కడియం శ్రీహరి

    Kadiyam Srihari : తాను కమీషన్లు తీసుకున్నట్లు ఎవరూ నిరూపించినా తన...

    Jagan Dramas : జగన్ డ్రామాలకు ఎండ్ కార్డు వేస్తామంటున్న నేతలు!  

    Jagan Dramas : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన...

    Janasena : జనసేన పార్టీకి హైకోర్టులో ఊరట

    ఆ పార్టీకే గ్లాస్ గుర్తు కేటాయింపు జనసేన పార్టీకి హైకోర్టులో ఊరట...

    Siri Hanumanthu : సిరి హనుమంతు సొగసులు

    Siri Hanuman : యాంకర్ సిరి హనుమంతు ప్రస్తుతం జబర్దస్త్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan Dramas : జగన్ డ్రామాలకు ఎండ్ కార్డు వేస్తామంటున్న నేతలు!  

    Jagan Dramas : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన...

    Who Is Jagan : ఇంతకీ జగన్ ఎవరు? అర్జునుడా..? అభిమన్యుడా..? కుంభకర్ణుడా..?

    Who is Jagan : ఏపీ రాజకీయాల్లోని నాయకుల తీరు ఇతిహాసాల్లోని...

    Nara Bhuvaneshwari : కురుక్షేత్రానికి సిద్ధమా? నారా భువనేశ్వరి పిలుపు

    Nara Bhuvaneshwari : మే 13న జరగబోయే కురుక్షేత్రానికి మీరు సిద్దమా.....