Social Media : ఇప్పుడు పరిస్థితులు మారాయి. గతంలో వేదిక ఉంటేనే వారి టాలెంట్ బయటపడేది. కానీ ప్రస్తుత రోజుల్లో ట్రెండ్ మారిపోయింది. సోషల్ మీడియా పుణ్యమాని రాత్రికి రాత్రే స్టార్లుగా మారుతున్నారు. అంతవరకు వారెవరో తెలియదు. ఒక్క వీడియో పోస్టు చేస్తే దానికి వచ్చే లైకులు, షేర్లతో అకస్మాత్తుగా స్టార్ లుగా మారుతున్నారు. అంతటి మహత్తు సోషల్ మీడియాకు ఏర్పడింది.
మనకు సంబంధించిన విషయాన్ని ఎవరో షేర్ చేసినా మనకు గుర్తింపు రావడం జరుగుతుంది. మన వీడియోకు వచ్చే లైకులతో మన ఇమేజ్ కూడి ఉంటుంది. ఈనేపథ్యంలో ప్రతిభ ఉన్న వారికి అవకాశాలు పుష్కలంగా వస్తున్నాయి. మనం చేసే వాటిని ఎవరో వీడియో తీసి పోస్టు చేసినా మనకు రావాల్సిన గుర్తింపు రావడం సహజమే.
బస్టాండ్, రైల్వేస్టేషన్ వేదిక ఏదైనా మన వీడియోకు లైకులు వస్తే చాలు మనం స్టార్లుగా మారిపోవడం ఖాయం. దీంతో ప్రతి వారు తమ వీడియోలు పోస్టు చేస్తున్నారు. దీంతో ఆ వీడియోకు అందే ప్రచారంతో వారి జాతకమే మారుతోంది. క్లాసికల్ డాన్స్ లో శిక్షణ పొందిన శ్రియ హనుమంతు ఈ ఏడాది ఏప్రిల్ 10న తొలిసారి అధికారిక సోలో ప్రదర్శన ఇవ్వడంతో ఇన్ స్టా గ్రామ్ లో ఆమె నాట్యానికి ఎంతో గుర్తింపు దక్కింది.
దీంతో ఆమెకు సోషల్ మీడియా వేదికగా ఎంతో ఖ్యాతి లభించింది. ఆమె సెలబ్రిటీగా మారిపోయింది. ఒక్క షోతోనే ఎక్కడికో వెళ్లిపోయింది. అలా సోషల్ మీడియా ప్రతి విషయాన్ని ఎంతో ప్రచారం చేసి మనకు దక్కాల్సిన గౌరవాన్ని తీసుకొస్తుంది. ఇలా సామాజిక మాధ్యమాలు మనల్ని స్టార్లుగా చేస్తున్నాయి. మనకు దక్కాల్సిన గౌరవం దక్కేలా చేస్తోంది.