
Viral video కొందరు ప్రమాదం జరుగుతున్నా తమకు సంబంధం లేనట్లు ఉండటం చూస్తుంటాం. అది కూడా తన కుటుంబానికి ఆపద వచ్చినా స్పందించరు. తమకు పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తుంటారు. చూసే వారికి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. కానీ వారు మాత్రం తమ పంథా మార్చుకోరు. తాము చెప్పిందే వేదం తను సూచించిందే మార్గమన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. దీంతో ఎదుటి వారికి ఎక్కడో కాలుతుంది. ఈ నేపథ్యంలో వారి ప్రవర్తన అందరికి కంటగింపుగా మారడం సహజమే.
రాష్ట్రంలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. ఇళ్లు మొత్తం నీళ్లలోనే నానుతున్నాయి. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఓ ఇంట్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఇంట్లోని వారు ఆందోళన చెందారు. వస్తువులను సర్దుకుంటూ కనిపించారు. ఇళ్లంతా వరద నీటితో నిండిపోయింది. దీంతో ఎటూ పాలుపోక బిక్కుబిక్కుంటూ గడిపారు.
వారంతా అలా హైరానా పడుతుంటే ఓ పెద్దాయన మాత్రం దర్జాగా టీవీ చూస్తూ కనిపించాడు. ఇది చూస్తే ఓ సామెత గుర్తుకు వచ్చింది. రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి మాత్రం ఫిడేలు వాయించుకుంటూ ఉన్నాడని అంటారు. సరిగ్గా ఆ సామెత ఆ ముసలాయనకు సరిపోతుంది. కుటుంబమంతా కలవరపడుతుంటే అతడు మాత్రం టీవీలో సీరియల్ చూస్తూ కనిపించాడు. కాలు మీద కాలు వేసుకుని అతడి స్టైల్ ను చూసి నెటిజన్లు కామెంట్లు పెట్టారు.
ఏదైనా నీ దర్జాయే దర్జా తాత అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పిల్లాడు కూడా కాదు. పెద్దమనిషే అలా చేయడం విమర్శలకు తావిచ్చింది. నీళ్లొస్తే అందరు భయపడుతుంటారు. కానీ ఆయన మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. చోద్యంగా చూశారు కానీ స్పందించలేదు. అయ్యో మా ఇల్లు మునిగిపోతుందనే బాధ కూడా అతడిలో కనిపించలేదు. సో ఇలాంటి ఫీలింగ్ లేని మనుషులు కూడా ఉంటారని అతడిని చూస్తేనే తెలుస్తుంది. అతడు రేసుగుర్రంలో శ్రుతిహాసన్ టైపు కావచ్చని నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
https://www.facebook.com/reel/1731304600634078






