
Andaman Jail : కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘వేట’ మూవీతో ఎక్కువ మందికి తెలిసింది ‘అండమాన్ జైలు’ గురించి. దానికి ముందు వరకు అక్కడ ఒక జైలు ఉన్నదనే విషయం తెలుగువారికి తెలియదనే చెప్పవచ్చు. చేయని తప్పునకు మన హీరో మెగాస్టార్ ను ఆ జైలుకు పంపిస్తారు. అక్కడి పరిస్థితులు, చిరంజీవి పడే కష్టాలు సినిమాగా మనకు చూపించారు. అసలు ఆ జైలు అలా ఉంటుందా? అక్కడి పరిస్థితులు నిజమేనా? ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అక్కడ పరిస్థితులు నిజంగానే అలాగే ఉంటాయట. ఇక శిక్షలు కూడా అలాగే ఉంటాయట. స్వాతంత్ర సమరయోధులు ఆ జైలులో పడిన కష్టాలు అంతా ఇంతా కావు. అక్కడికి వెళ్లాలంటేనే సముద్రంపై మాత్రమే వెళ్లవచ్చు. జైలు నిర్మాణం కూడా అత్యంత భయంకరంగా ఉంటుందట. ఒక ఖైదీ ఉన్నాడని మరో ఖైదీకి తెలియదు. అంటే అక్కడ ఒక్కడే ఉన్నా అనుకొని జీవించాల్సిందే. ఇక శిక్షలు కూడా అదే విధంగా ఉంటాయట. గోనె సంచి చొక్కా, ప్యాంట్ వేసి ఎండలో నిలబెడతారట. సరైన పనిముట్ల లేకుండానే ఎన్నో పనులు చేయిస్తారట.
ఎదిరిస్తే కొట్టడం, తిరగబడితే శిక్షలు మరింత కఠినంగా అమలు చేస్తుంటారట. పారిపోయేందుకు ప్రయత్నిస్తే ఉరిశిక్షవేయడం ఇక్కడ ఆనవాయితీగా చెప్పవచ్చు. ఒకే సారి ముగ్గురిని ఉరేసేందుకు ఇక్కడ ఏర్పాట్లు ఉంటాయట. ఈ జైలలో కిటీకీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఖైదీలను ఉంచే ప్రతీ గదికి ఒక కిటికీ ఉంటుంది. అవి సాధారణ కిటికీలు కాదట ప్రత్యేకమైనవట. ఖైదీలు వాటి నుంచి బయటకు చూస్తే కేవలం కిటికీలకు ఎదురుగా ఉన్న ప్రదేశం మాత్రమే కనిపిస్తుందట. ఎట్టి పరిస్థితుల్లో పక్కన ఉన్న ప్రదేశం కనిపించదట. కానీ బయటి నుంచి లోపలికి చూస్తే మాత్రం పూర్తి జైలు గది కనిపిస్తుందట.
వీటి నిర్మాణం ఇంత లాజిక్ ఉంటుందట. జైలుకు 10*10 అంగుళాల తాళం వేస్తారట. శిక్ష అనుభవించిన ఖైదీలు తమ బాధలు, జైలు జీవితం గురించి రాసుకున్నారట. బ్రిటీష్ పాలన పోయి స్వతంత్రం వచ్చిన తర్వాత తొలి భారత భూ భాగం అండామాన్ దీవులే అని నేతాజీ ప్రకటించారు.






