
Jogi Ramesh : మాజీ మంత్రి జోగి రమేష్ రాజకీయ దూకుడే ఇప్పుడు అతనికి చిక్కుగా మారిందా అన్న చర్చ సాగుతోంది. అగ్రిగోల్డ్ భూముల కుంభకోణంలో జోగి కుటుంబం పాత్ర స్పష్టమై, కుమారుడు, బంధువు అరెస్టు కావడం, ఆయన కూడా తెర వెనుక కీలకంగా వ్యవహరించినట్టు విచారణలో తేలడంతో త్వరలోనే జోగి అరెస్టు సంభవిస్తుందని ప్రచారం ముమ్మరమైంది. ఒకప్పుడు వైసీపీలో జోష్‌తో సాగిన జోగి, ఇప్పుడు కేసుల ఒత్తిడిలో రాజకీయంగా నిష్క్రియతకు గురయ్యారు.






