
Elinati Shani Effect : హిందూ ధర్మశాస్త్రం ప్రకారం.. శని దేవుడిని న్యాయానికి, కర్మలకు అధిపతిగా కొలుస్తారు. జన్మ నక్షత్రాలను బట్టి సంక్రమించే రాశుల ఆధారంగా జీవన శైలిలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఎవరు చేసిన ఖర్మ వారు అనుభవిస్తారని పెద్దలు చెప్తుంటారు. ఎవరి కర్మలకు ఎలాంటి ఫలితం పొందాలనే దానిని శని దేవుడు నిర్ణయిస్తాడని హిందువుల గట్టి నమ్మకం.
ఎవరి జాతకంలో శని బలహీనంగా ఉండి వక్ర స్థానంలో ఉంటాడో అలాంటివారు కష్టాల ఊబిలో చిక్కుకున్నట్లే అని చెప్తారు. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏళ్లనాటి శని ప్రభావం మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎంతంటే జీవతంలో అన్నీ కోల్పోయి ఇంకెందుకు బతుకు అనే ఆలోచనను తెప్పిస్తుంది. ఇక శని ప్రభావం ఎంత ఉంటుందటే ఏ పని చేసినా కలిసి రాదు. పైగా ఆ పనే నాశనం చేస్తుంది.
అయితే జ్యోతిష్య శాస్త్రంలో సమస్యలతోనే నివారణ మార్గాలు కూడా సూచించారు పండితులు. జాతర రిత్యా ఏళ్లనాటి శని ఉంటే కొన్ని శనిగ్రహ పూజలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అంటున్నారు కొందరు ప్రముఖ జ్యోతిష్య పండితులు. మానవ మనుగడపై ప్రభావితం చూపే వాటిలో ఏళ్లనాటి శని, ఆర్థాష్టమ శని, అష్టమ శని ఇలా అనేక దోషాలు ఇబ్బందులకు గురిచేస్తాయని చెప్తున్నారు.
ఇలాంటి సమయంలో ఏళ్లనాటి శని ప్రభావం తొలగిపోవాలంటే నవగ్రహాల్లో ఏడవ వాడైన శనిశ్వరుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. నల్లని నువ్వులతో స్వామిని పూజించాలి. లేదంటే శనివారం ఉపవాసం ఉండి శనీశ్వరుడిని ధ్యానిస్తూ స్వామికి తైలాభిషేకం చేయాలి. కాకులకు రొట్టెలు పెట్టడం, ఆవులకు నవ ధాన్యాలు తినిపించడం చేస్తే ఏ రాశి వారికైతే ఏళ్లనాటి శని ఉంటుందో అలాంటి వారికి శని ప్రభావం తగ్గి మంచి జరుగుతుందని శాస్త్రం చెప్తోందని పండితులు తెలిపారు.