- అంతుచిక్కని జనసేన అధినేత ఆలోచనలు
Clarity on alliances : జనసేన అధినేత పవన్ కల్యాణ్ భవిష్యత్ ప్రణాళికలపై ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. అదే సమయంలో పార్టీ శ్రేణులను పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేయలేకపోతున్నారు. ఇటీవల పవన్ కల్యాన్ రెండు రోజుల పాటు మంగళగిరిలోని పార్టీ ఆఫీసులోనే ఉన్నారు. జనసేన కార్యాలయంలో నూతన భవనాన్ని ప్రారంభించారు. రెండు రోజుల పాటు కార్యాలయంలోనే ఉన్న ఆయన పార్టీ కీలక నేతలతో పూర్తి స్థాయిలో ఇంటరాక్ట్ కావడం లేదు. కానీ కొన్ని సర్వే సంస్థల ప్రతినిధులతో ఆయ సమావేశమైనట్లు తెలుస్తున్నది. తెలుగుదేశంలోని కీలక నేతలతో కూడా ఆయన రహస్యంగా సమావేశమైనట్లు సమాచారం.
ఇప్పటికే బీజేపీతో అలయన్స్ లో పవన్, టీడీపీతోనూ పొత్తు ఉండే అవకాశాలు ఉన్నాయని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చబోమని ఇప్పటికే ఆయన ప్రకటించారు. దీనిని బట్టి ఏపీలో కాంగ్రెస్ ప్రస్తుతం ఉనికిలో లేదు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశమే కాబట్టి.. ఆ పార్టీతో పొత్తు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తున్నది.
అయితే జనసేన పోటీ చేసే స్థానాలపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. గెలుపు అవకాశం ఉన్న చోటనే పోటీ చేస్తామని ఇప్పటికే పవన్ ప్రకటించారు. వైసీపీని గద్దె దించడానికి అన్ని అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. అయితే జనసేనకు ఎక్కడెక్కడ అనుకూల పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునేందుకు పవన్ కొన్ని సర్వే సంస్థలకు బాధ్యతలు అప్పగించినట్లుసమాచారం. కచ్చితంగా పోటీ చేసే అన్ని స్థానాల్లో గెలిచేందుకు పవన్ దృష్టి సారించారు. జనసేనకు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు.. స్థానిక ఎన్నికల్లో వచ్చిన ఓట్లు.. తాజాగా సర్వేల్లో వస్తున్న ఫలితాల ఆధారంగా టీడీపీకి కొన్న ప్రతిపాదనలు ముందుంచనున్నట్లు తెలుస్తున్నది.
ఈ విషయమై పార్టీ నేతలతో చర్చించేందుకు పవన్ సుముఖంగా లేడని ఆ పార్టీ వర్గాయి చెబుతున్నాయి. తన నిర్ణయాలను ఏకీభవించేవారే పార్టీ నేతలని.. వ్యతిరేకించే వారిని తాను పట్టించుకోబోనని ఆయన ఖరాఖండిగా చెబుతున్నట్లు తెలుస్తున్నది. అవకాశవాద రాజకీయాలు.. పార్టీ నేతలపై క్లారీటీ ఉన్న పవన్.. తన మార్కు ప్రణాళికతో ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.