
Another planet : జీవజాలం కేవలం భూమి మీదనేఉందా? ఇలాంటి గ్రహాలు అంతరిక్షంలో ఇంకేమైనా ఉన్నాయా? అక్కడ జీవరాశి ఉందా.. గ్రహాంతరవాసులు మనుగడ సాగిస్తున్నారా అనే అనేక ప్రశ్నలపై సమాధానాల కోసం ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. గ్రహాంతరవాసులకు సంబంధించిన కచ్చితమైన సమాచారం లేకపోయినా.. ఏదో ఒక గ్రహంపై జీవిస్తున్నారనేది అందరి నమ్మకం. వాటికి ఊతమిచ్చేలా ఓ సంఘటన చోటు చేసుకుంది. భూమికి సమీపంలో ఉన్న అంగారక గ్రహం నుంచి ఎన్‌కోడ్ చేసిన ఓ సమాచారాన్ని యూరప్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఎక్సోమార్స్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటార్(టీజీఓ) భూమికి చేరవేసింది. అంగారకుడి చుట్టూ తిరుగుతూ అక్కడి పరిస్థితులను నిశితంగా గమనించేందుకు యూరప్ స్పేస్ ఏజెన్సీ టీజీఓను గతంలో ప్రయోగించింది. అయితే, ఈ సందేశాన్ని గ్రహాంతర వాసులే పంపించారా? అనే దానిపై ఎటువంటి స్పష్టత లేదు
అంగారక గ్రహం నుంచి సమాచారాన్ని స్వీకరించిన టీజీఓ 16 నిమిషాల్లో ఆ సందేశాన్ని ఎర్త్ స్టేషన్‌కు చేరవేసింది. దీనిలో ఏముందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఒక వేళ అది గ్రహాంతర వాసులే పంపిన సమాచారమే అయితే ఈ ఘటన చరిత్రలో నిలిచిపోతుందని ‘ఎ సైన్స్ ఇన్ స్పేస్’ ప్రాజెక్టులో భాగమైన డానియేలా ది పౌలిస్ తెలిపారు. ‘ఇది చరిత్రలోనే నిలిచిపోయే ఘటన. గ్రహాంతరవాసుల ఉనికి తెలుసుకునేందుకు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. ఇతర గ్రహాలపైనున్న జీవరాశుల నుంచి ఓ సందేశం రావడం భవిష్యత్ పరిశోధనలకు పునాది. రానున్న రోజుల్లో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు ఊతమిస్తుంది అని అని పౌలిస్ తెలిపారు.
అయితే, ఎన్కోడ్ చేసిన ఆ సందేశంలో ఏముందో తెలుసుకోవడం శాస్త్రవేత్తలకు కఠినంగా మారింది. దానిని డీకోడ్ చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నవారికి శాస్ర్తవేత్తలకు అవకాశం కల్పించారు. శాస్త్రసాంకేతిక పరంగానే కాకుండా ఆ సందేశంలో సాంస్కృతిక పరమైన అంశాలేమైనా ఉన్నాయా? అనే విషయాలు తెలుసుకునేందకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంగారక గ్రహం నుంచి ఎన్కోడ్ చేసి వచ్చిన సిగ్నల్స్ను https://asignin.space/the-
ఏలియన్లు భూమిని సందర్శించాయా?
నలగురు గ్రహాంతరవాసులు, వారి వ్యోమనౌకలుగా భావిస్తున్న ఫ్లయింగ్ సాసర్లు భూమిపై ఉన్నాయా? లేవా?.. అనే అంశం చాలా ఏళ్లుగా అంతుచిక్కని రహస్యమే. అయితే.. ఏలియన్లు భూమిని సందర్శించినట్లు, లేదా ఇక్కడ దిగినట్లు చెప్పడానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని అమెరికా సీనియర్ సైనిక అధికారులు గతంలో వెల్లడించారు. యూఎస్ వో సంబంధిత ఘటనలపై రూపొందిన వందలాది రిపోర్టులను తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఇంటెలిజెన్స్, భద్రత కోసం అమెరికా రక్షణశాఖ అండర్ సెక్రెటరీ రోనాల్డ్ మౌల్ట్రీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.