
Ruther Ford : గ్లోబల్ టీ20 లీగ్ సీరిస్ లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్న వెస్టిండీస్ ఆటగాడు రూథర్ ఫోర్డ్ కు అమెరికాలో అర ఎకరం భూమి ప్రైజ్ కింద ఇచ్చారు. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇప్పుడు పొట్టి క్రికెట్ గా టీ20 ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇంతకాలం క్రికెట్ కు దూరంగా ఉణ్న అమెరికా, కెనడా వంటి దేశాల్లో కూడా టీ 20, టీ 10 లీగ్ లు నిర్వహిస్తున్నారు. అమెరికా కూడా పలు అంతర్జాతీయ మ్యాచ్ లకు అతిథ్యం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నది. అయితే ప్రస్తుతం కెనడాలో గ్లోబల్ టీ20 మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఈ సిరీస్ చివరి మ్యాచ్ లో మాంట్రియల్ టైగర్స్ సర్వే.. సర్రే జాగ్వార్ తో తలపడింది. తొలుత బ్యాటింగ్ సర్రే జగ్వార్ 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. జతీందర్ సింగ్ 57 బంతుల్లో 56 పరుగులు చేశాడు. అయాన్ ఖాన్ 15 బంతుల్లో 26 పరుగులు చేశాడు.
దీంతో రంగంలోకి దిగిన మాంట్రియల్ టైగర్స్ తొలుత తడబడింది. 12 ఓవర్లలో 61 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత రూథర్ ఫోర్డ్ దీపేంద్ర సింగ్ ద్వయం ప్రశాంతంగా ఆడింది. కానీ ఈలోగా దీపేంద్ర సింగ్ 16 పరుగుల వద్ద అవుట్ అవడంతో మరోసారి ఇబ్బందుల్లో పడింది. ఆఖరికి ఆండ్రీ రస్సెల్ 6 బంతుల్లో 20 పరుగులు చేయడంతో మాంట్రియల్ టైగర్స్ గెలిచింది. ఇక రూథర్ ఫోర్డ్ 29 బంతుల్లో 38 పరుగులు చేసి చివరి వరకు మైదానంలో ఉన్నాడు. ఇక ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లు కూడా రూథర్ ఫోర్డ్ కు దక్కాయి.
అయితే సాధారణంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్న వారికి ప్రోత్సాహాకాలు ఇస్తారు. అయితే ఇక్కడ రూథర్ ఫోర్డ్ కు అమెరికాలో అర ఎకరం భూమిని బహుమతిగా ఇఛ్చి నిర్వాహకులు అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక అభిమానులైతే ఫుల్ జోష్ లో ఉన్నారు.