
Mahesh Babu : రాజమౌళి సినిమాల్లో విలన్ పాత్ర చాలా బలంగా ఉంటుంది. అయితే మహేష్ బాబుతో ఆయన తీస్తున్న సినిమాలో ఆ స్థాయి విలనిజం ఉండకపోవచ్చని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కథ ప్రకారం హీరో నిధి వేటలో సాగే అడ్వెంచర్ నేపథ్యంలో సినిమా ఉండటం వల్ల, ఇందులో ప్రత్యేకంగా బలమైన విలన్ పాత్రకు అంతగా ప్రాధాన్యం ఉండకపోవచ్చని అంటున్నారు. దీని వల్ల రాజమౌళి మార్క్ కాస్త తగ్గుతుందేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు.