ISRO’s Moon video goes viral : మనిషి మేథస్సుతో ఎన్నో కనుగొంటున్నాడు. తన ఆలోచనలతో అద్భతాలు ఆవిష్కరిస్తున్నాడు. చంద్రయాన్ 1, 2 ఫెయిలయినా 3 మాత్రం విజయవంతం అయింది. దీంతో మన ఖ్యాతి ఇనుమడిస్తోంది. భారత్ ప్రతిభకు అందరు దాసోహం అనే స్థాయికి చేరింది. ఇతర దేశాల ఉపగ్రహాలను సైతం మన దేశం నుంచి ప్రయోగిస్తున్నాం. మన రేంజి పెరిగిపోయింది. సాంకేతిక రంగంలో మన ప్రతిభ పెరిగింది.
చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కావడంతో దేశం మొత్తం గర్వించింది. మన టాలెంట్ తో రూపొందించిన ఉపగ్రహం ప్రయోగంతో మనకు ఇప్పుడు చాలా విషయాలు తెలుస్తాయి. ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ కానుంది. దీన్ని జులై 14న ప్రయోగించారు. ఆగస్టు 5న కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్ 3 నుంచి చంద్రుడి ఉపరితలం వీడియో పోస్టు చేసింది.
ఇది చంద్రుడిపై ల్యాండ్ అయిన తరువాత అక్కడి పరిస్థితులు మొత్తం మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఇన్నాళ్లు మనకు చంద్రుడి గురించి ఏ విషయాలు తెలియలేదు. దీంతో అక్కడ ఏముందో అనే విషయం కూడా మనకు తెలియదు. ఈ నేపథ్యంలో మనం ప్రయోగించిన చంద్రయాన్ 3 పనితనంతో నూతన శకం ఆరంభం కానుంది. చంద్రుడిపై ఏం ఉంది? మానవులు ఉండటానికి అనువైన ప్రదేశం ఉందా? అనే విషయాలు మనకు త్వరలోనే తెలుస్తాయి.
ఇండియా ప్రయోగించిన చంద్రయాన్ 3 ఉపగ్రహంతో మనకు నూతన విషయాలు తెలియనున్నాయి. చంద్ర మండలం గురించి మనం ఇన్నాళ్లు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దొరికినట్లు అయింది. అక్కడి పరిస్థితులను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకునే తరుణం ఆసన్నమైంది. దీంతో మన దేశం చంద్రమండలం గురించి తెలుసుకుని అవసరమైతే అక్కడ కూడా నివాసం ఏర్పాటు చేసుకునే ఆలోచనలకు రూపం కల్పించనుందని అంటున్నారు.
The Moon, as viewed by #Chandrayaan3 spacecraft during Lunar Orbit Insertion (LOI) on August 5, 2023.#ISRO pic.twitter.com/xQtVyLTu0c
— LVM3-M4/CHANDRAYAAN-3 MISSION (@chandrayaan_3) August 6, 2023