IT Employees Car Rally :
‘స్కిల్ డెవలప్‌మెంట్’ కేసులో చంద్రబాబు అరెస్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలం అవుతోంది. ఈ రంగం ఆ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాల్లోని వ్యక్తులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇటు పార్టీ నాయకులతో సహా అటు కుల సంఘాలు, వివిధ వర్గాలు, వ్యాపార, వాణిజ్య కేంద్రాల నిర్వాహకులు ఆయనకు మద్దతిస్తున్నారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి సుదీర్ఘకాలం సేవలందించారు. విడిపోయిన తెలంగాణను పక్కన పెడితే ఎక్కువ సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ను ఏలిన సీఎంగా రికార్డు సృష్టించారు.
తెలంగాణ విడిపోక ముందు హైదరాబాద్ లో ఐటీ భూమ్ ను ఒక రేంజ్ కు తీసుకువచ్చారు చంద్రబాబు. దీంతో తెలంగాణ రాజధాని ఇప్పటికీ చంద్రబాబును ఆరాధిస్తూనే ఉంటారు. బిల్ క్లింటన్ ను హైదరాబాద్ కు తీసుకువచ్చిన ఘటన కూడా చంద్రబాబు రికార్డు సాధించారు. ఇవే కాకుండా తెలుగు వారు ఏ దేశంలో ఉన్నా అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి వారి పెట్టుబడికి సహకరించి తెలుగు వారిని అత్యున్నత స్థానంలో నిలిపేందుకు శాయశక్తులా కృషి చేస్తారు. ఇదే ఇప్పుడు ఆయనకు కలిసి వస్తుంది.
చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ టూ రాజమహేంద్రవరం (చంద్రబాబు జైలు శిక్ష్ అనుభవిస్తున్న ప్రాంతం) వరకు కారు ర్యాలీకి పిలుపునిచ్చారు. దీంతో ఏపీ బార్డర్ గరికపాడు వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించింది ఏపీ సర్కార్. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే ఏపీలోకి వదులుతున్నారు. వారిని అడ్డుకునేందుకు మోహరించిన పోలీసులను చూస్తే పాకిస్తాన్ బార్డర్ లాగి కనిపిస్తుంది. వందలాది మంది పోలీసులు.. లాఠీలు పట్టుకొని సిద్ధంగా ఉండడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.