
హైదరాబాద్ సన్ రైజర్స్ కు ఓటములు బాధిస్తున్నాయి. అపజయాలు వేధిస్తున్నాయి. సునాయాసంగా గెలిచే మ్యాచులను పోగొట్టుకుంటోంది. దీని వల్ల విమర్శల బారిన పడుతోంది. ఈ నేపథ్యంలో గురువారం కోల్ కత నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచులో ఓటమి పొందడంతో విమర్శల పాలైంది. అవసరమైనప్పుడు సరైన రీతిలో స్పందించకపోవడంతో అపజయం కలిగినట్లు తెలుస్తోంది.
సన్ రైజర్స్ ఓనర్ కావ్య గురువారం మ్యాచ్ తిలకించారు. ఆద్యంతం మ్యాచ్ ను ఎంజాయ్ చేసింది. కానీ ఓటమికి గురికావడంతో ఆమె ముఖం మాడిపోయింది. నెటిజన్లు కూడా పలు రకాలుగా విమర్శలు చేశారు. పాపం కావ్య పాపకు పగోనికి రాకూడని కష్టం వచ్చిందని పోస్టులు పెట్టారు. దీంతో ఆమె చిన్నబోయింది. తన జట్టు ఇంత పేలవంగా ఆడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సులభంగా గెలవాల్సిన మ్యాచ్ ను చేజేతులా చేజార్చుకుంది. బౌండరీలో కొట్టినప్పుడు ఎగిరి గంతేసింది. వికెట్లు పోయినప్పుడు నిరాశ వ్యక్తం చేసింది. ఇలా మైదానంలో కావ్య చేసిన హంగామను వీడియోల రూపంలో నెటిజన్లు విడుదల చేసి కావ్య గురించిపలు కామెంట్లు పెట్టారు. సన్ రైజర్స్ ఆటతీరు ఇంత అధ్వానంగా ఉందని ప్రశ్నించారు.
విజయానికి 6 బంతుల్లో 9 పరుగులు చేయలేక వెనుదిరగడం ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో అభిమానులు విభిన్న రీతుల్లో కామెంట్లు చేశారు. కావ్య పాప కష్టం గంగ పాలైందని విమర్శలు చేశారు. ఆటగాళ్ల తీరు అందరిలో ఆగ్రహం పెంచింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ను అనవసరంగా వారికి అప్పగించడంపై సంచలన కామెంట్లు చేశారు.






