BRO Movie :
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించిన చిత్రం బ్రో. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జులై 28న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్ర ఖని దర్శకత్వంలో తెరకెక్కిన బ్రో విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరుగుతున్నాయి.
సినిమా టీజర్ చూసిన వారికి బ్రో సినిమా పెద్ద సంచలనమే కానుందని చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. అభిమానుల నుంచి వచ్చిన రెస్పాన్స్ తో చిత్రం మంచి హిట్ సాధిస్తుందని అనుకుంటున్నారు. థమన్ అందించిన సంగీతం సినిమాకు మరింత ఊపు తీసుకురానుంది. ఈనేపథ్యంలో బ్రో సినిమా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారనుంది.
పవర్ స్టార్ సినిమా అంటే అభిమానుల్లో క్రేజీ ఉండటం సహజమే. అందుకే ఆయన సినిమా వస్తుందంటే చాలు ఎంత ఆసక్తి కనబరుస్తుంటారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ తో పాటు ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి వస్తున్నాడు. దీంతో అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. పవనిజం అంటే ఓ పిచ్చి. తెర మీద ఆయన పేరు చూస్తే చాలు చప్పట్లు, ఈలలు వేయడం కామనే.
దీంతో బ్రో సినిమా వండర్స్ క్రియేట్ చేయడం జరుగుతుందని అంటున్నారు. పవన్ కల్యాణ్ తనదైన శైలిలో నటించడంతో సినిమా కచ్చితంగా హిట్ టాక్ తెచ్చుకోవడం ఖాయం. మొత్తానికి బ్రో మరో సంచలనం కానుంది. పవనిజం తో సినిమా సక్సెస్ కావడం సహజం. ఇందులో పవన్ సంభాషణలు వింత గొలిపేవిగా ఉంటాయి. అందుకే బ్రో సినిమా విడుదలకు ముందే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.