39.4 C
India
Thursday, April 25, 2024
More

    జూనియర్ ఎన్టీఆర్ వస్తే టీడీపీకి షాక్..!

    Date:

    junior ntr helps to nandamuri taraka ratna
    junior ntr

    ఈనెల 28న జరిగే ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 52 అడుగుల ఎత్తు గల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరణకు జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించడం పై పలువురు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కలవడాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ సీరియస్ గా తీసుకుని ఖమ్మంలో సడెన్ గా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసి దాన్ని ఆవిష్కరించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించడం పలు రాజకీయ అనుమానాలకు తావిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించి ఏపీలో రాణించాలని సీఎం కేసీఆర్  భావిస్తున్నారా.. లేక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన వ్యక్తిగతంగా ఖమ్మంలో జూనియర్ ఎన్టీఆర్ వాడుకొని రాబోయే ఎన్నికల్లో కమ్మ కులస్తుల ఓట్లు రాబట్టుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నారాఅని పలువురు చర్చించుకోవడం విశేషం.

    * జూనియర్ ఎన్టీఆర్ వస్తే టిడిపికి షాకే..

     ఒకవేళ బీఆర్ఎస్ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ఏపీలో పోటీ చేస్తే టిడిపి చాలా తీవ్రంగా నష్టపోతుందని పలువురు సీనియర్ రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. టిడిపి పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడు 2009 ఎన్నికల్లో తన అవసరం కోసం జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకొని  దూరం పెట్టిన విషయం అందరికీ తెలిసిందే.. జూనియర్ ఎన్టీఆర్ కున్న వాక్చాతుర్యం.. ప్రతిభ,తో జూనియర్ ఎన్టీఆర్ వారసత్వ రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడని ఇప్పుడు తన రాజకీయ ఉనికి ఉండదని జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెట్టాడని ఎన్టీఆర్ అభిమానులు వాపోతున్నారు.

    *  ఓట్ల కోసమే.. విగ్రహం ఏర్పాటు..

     ఖమ్మంలో ఎక్కువగా కమ్మ కులస్తులు ఉన్నారు. అయితే కమ్మ కులస్తులను తమ వైపు తిప్పుకొని రాజకీయంగా పట్టు సాధించడం కోసం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది ఏళ్లు గడిచిన ఏనాడు ఎన్టీఆర్ విషయాన్ని ప్రస్తావించని టిఆర్ఎస్ ప్రభుత్వం, ఆకస్మికంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వెనుకున్న రాజకీయ రహస్యం ఏమిటో తెలియడం లేదని ఎన్టీఆర్ అభిమానులు వాపోతున్నారు. సీఎం కేసీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకొని ఏపీలో రాజకీయ చక్రం తిప్పాలని చూస్తున్నారా.. లేక  ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతోనే విగ్రహాన్ని ఏర్పాటు చేశారా..అనే సందేహాలు అందరి మెదళ్లను తొలుస్తున్నాయి.

     ఒకపక్క జూనియర్ ఎన్టీఆర్  పలు సందర్భాల్లో  జర్నలిస్టులు అభిమానులు రాజకీయాల్లోకి వస్తారా.. తాత అడుగుజాడల్లో నడుస్తారా.. అని అడిగినప్పుడు ఇప్పుడే రాజకీయాల్లోకి రానని.. ఇంకా చాలా టైం ఉందని  చెబుతూ వస్తున్నారు. ఇప్పుడేమో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు వెళ్లడంపై పలువురు రకరకాలుగా  చర్చించుకోవడం కోసం మెరుపు. ఏది ఏమైనా  జూనియర్ ఎన్టీఆర్ తాత మీద ఉన్న అభిమానంతో వెళ్లి విగ్రహావిష్కరణ చేసి వస్తారా.. లేక రాజకీయంగా ఏమైనా మాట్లాడతారా వేచి చూడాల్సిందే..

    Share post:

    More like this
    Related

    Actress Tamannaah : ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసులో నటి తమన్నాకు సమన్లు

    Actress Tamannaah : అక్రమ ఐపీఎల్ మ్యాచ్‌ స్ట్రీమింగ్ కేసులో నటి...

    BJP Madhavi Latha : బీజేపీ అభ్యర్థి మాధవీలత ఆస్తులు ఎంతంటే..? – రూ. 218 కోట్లు ఉన్నట్లు వెల్లడి

    BJP Madhavi Latha : హైదరాబాద్ బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి...

    Super Star New Multiplex : సూపర్ స్టార్ న్యూ మల్టీప్లెక్స్‌.. ఫోటోలు వైరల్‌

    Super Star New Multiplex :  కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూర్ లో...

    T. Jeevan Reddy : టి. జీవన్ రెడ్డి సతీమణికి 50 తులాల బంగారం

    T. Jeevan Reddy : తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Ramesh : బీఆర్ఎస్ కంటే వైసీపీ వేగంగా ఖాళీ.. సీఎం రమేశ్ సంచలన కామెంట్..

    CM Ramesh : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏక...

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో  పసుపు వనం

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గద్దె దించడానికి జనసేన,తెలుగుదేశం,బీజేపీ...

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...