Home EXCLUSIVE Italy News : విధిరాతను ఎవరూ మార్చలేరు.. వీరిద్దరి జీవితాల్లో అదే జరిగింది!

Italy News : విధిరాతను ఎవరూ మార్చలేరు.. వీరిద్దరి జీవితాల్లో అదే జరిగింది!

11
Italy News
Italy News, Stefano Pirelli, Antonietto Demasi

Italy News : ‘‘ఎన్నెన్నో అనుకుంటాం.. అవన్నీ అవుతాయా..?’’ ‘‘మనం ఒకటి తలిస్తే.. విధి ఒకటి తలిచినట్టు’’, ఇవన్నీ విధిరాతకు సంబంధించిన సామెతలు.. మన నిత్య జీవితంలోనూ ఏదో సందర్భంలో మనకు విధిరాత ఎంత బలీయమైనదో తెలిసి వస్తుంది కూడా. ఒక్కొక్కసారి మనం ఏదో సాధించాలని నానా ప్రయత్నాలు చేస్తాం.. మనకు విధి సహకరించక ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్టుగా ఉండిపోతాం.. ఇంకొందరికి మట్టి పట్టుకున్నా బంగారమే అవుతుంది. కొందరు ఏ ప్రయత్నం చేసినా కలిసిరాదు.. మరికొందరు ఏ ప్రయత్నం చేయకున్నా జాక్ పాట్లు తగులుతుంటాయి.. అనుకోని ఆస్తులు వస్తుంటాయి. కొందరి జీవితాలు అప్పటివరకు ఆనందంగా సాగుతాయి..కానీ ఒక్కరోజులోనే తలకిందులవుతాయి.. ఇలాంటి దృశ్యాలు, అనుభవాలు.. ప్రతీ ఒక్కరి జీవితంలోనూ జరుగుతూనే ఉంటాయి. జీవితం మనం అనుకున్నట్టు ఉండదు.. ఏదీ జరుగాలో అదే జరుగుతుంది అనేది మాత్రం నిజం..

విధి ఆడే వింతలు ఎన్నో ఉంటాయి. అందులో కొన్ని అత్యంత భయంకరంగా ఉంటాయి. తల్చుకుంటేనే ఒళ్లు గగుర్పాటు పుడుతుంది. అలాంటి అనుభవమే ఈ జంటకు ఎదురైంది. అదెంటో చూద్దాం..

ఇటలీకి చెందిన ఓ ప్రేమజంట కలిసి జీవితాన్ని పంచుకోవాలని అనుకుంది. వారి పేర్లు.. స్టెఫానో పిరెల్లి(30), ఆంటోనియెట్టో డెమాసి(22).  ఇటలీలోని సావోనా పట్టణంలో స్నేహితులతో కలిసి క్రిస్మస్ విందులో పాల్గొనేందుకు వేర్వేరు పట్టణాల నుంచి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న మినీ విమానాలు(మైక్రో జెట్లు) గమ్యం చేరకముందే దాదాపు ఒకేసారి ప్రమాదాలకు గురయ్యాయి. స్టెఫానో ప్రయాణిస్తున్న టూ సీటర్ ఎయిర్ క్రాప్ట్ లో లోపం తలెత్తి క్రాష్ ల్యాండింగ్ అయ్యింది.  ఈ ప్రమాద స్థలానికి 25 మైళ్ల దూరంలో.. ఆంటోనియెట్టో వస్తున్న ఎయిర్ క్రాప్ట్ కూడా అదే సమయానికి ప్రమాదానికి గురైంది. పొగమంచు నడుమ చిమ్మచీకట్లో జరిగిన రెండు ప్రమాదాల్లో ఈ జంటకు త్రుటిలో పెను ప్రమాదం తప్పడం అద్భుతమే. స్టెఫానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటపడగా.. ఆంటోనియెట్టాకు, ఓ పైలట్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఆయా ప్రాంతాలకు శరవేగంగా చేరుకున్న ఫైర్ సిబ్బంది వారిని రక్షించి.. యువజంటతో పాటు ఇద్దరు పైలట్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

చూశారా.. వీరి జీవితంలో విధి మంచి చేసిందా లేదా చెడు చేసిందా అంటే ఏమని చెప్తాం. సంతోషంగా వేడుకలు జరుపుకుందామని వెళ్తుంటే ప్రమాదం జరిగి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడడం అద్భుతమే. కానీ ఇద్దరికీ ఒకే సమయంలో.. విమాన ప్రమాదాలు జరడం విధి రాతే కదా. ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహించగలరా.. అంతటి పొగమంచులో కూడా అగ్నిమాపకదళాలు గుర్తించడం కూడా వండరే కదా.  ప్రమాదంలో బయటపడిన చిమ్మచీకట్లో మంచులో కూరుకుపోతే ఏమయ్యేవారు. అందుకే అన్నారు మన పెద్దలు.. ఏ నిమిషానికి ఏమీ జరుగునో.. ఎవరూ ఊహించేదరో..అని.