indian movies ఈ మధ్యకాలంలో మన ఇండియన్ సినిమాలలో కూడా బోల్డ్ కంటెంట్ బాగా పెరిగింది. గత ఐదారేళ్లలోనే ఈ బోల్డ్ కంటెంట్ బాగా పెరిగింది అనే చెప్పాలి.. చిన్న పిల్లలు, ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూడలేని పరిస్థితిలో సినిమాలు తెరకెక్కుతున్నాయి.. ఈ క్రమంలోనే ఈ బోల్డ్ నెస్ శృతి మించుతుందని ఫ్యామిలీస్ కలిసి చూడలేక పోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే మరి కొంత మంది మాత్రం ఇలాంటివి అవసరం అన్నట్టు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఎలా ఉన్న యూత్ మాత్రం ఇలాంటి సినిమాలకు బాగా కనెక్ట్ అవుతున్నారు. అయితే ఇప్పుడిప్పుడు మన టాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు వస్తున్నాయి కానీ బాలీవుడ్ లో మాత్రం ఎప్పటి నుండో ఇలాంటి సన్నివేశాల్లో రెచ్చిపోయే ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు.
అప్పట్లోనే స్వరా భాస్కర్ అందరి కంటే ఒక అడుగు ముందుకు వేసి హస్తప్రయోగం సీన్స్ కూడా చేసింది.. ఇది బాలీవుడ్ లో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరీ బోల్డ్ నెస్ ఎక్కువ అయ్యిందని ఫ్యామిలీలో వెళ్లి చూస్తూ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ కామెంట్స్ ఏర్పడ్డాయి.. ఈ కామెంట్స్ పై ఇప్పుడు ఆమె తల్లి మాట్లాడింది..
నా కూతురు చేసిన సినిమాకు కావాలనే బ్యాడ్ పబ్లిసిటీ చేసారని నెగిటివిటీ కల్పించేందుకు అలాంటి కామెంట్స్ చేసారంటూ.. అసలు నా కూతురు చేసిన దాంట్లో తప్పేమి లేదు.. ఈ సమాజంలో సెక్స్ గురించి అవగాహన అవసరం అని అందుకే ఇలాంటి సినిమాలను వ్యతిరేకించడం మానేయాలి అంటూ ఈమె చేసిన కామెంట్స్ తో నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు.. నువ్వసలు తల్లివేనా ఇలాంటివేనా కూతురుకు చెప్పేది అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.