Ravindra Jadeja : భారత క్రికెట్ రవీంద్ర జడేజా గురించి మనకు తెలిసిందే. అతడి తండ్రి అనిరుధ్ సింగ్ అతడి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కొడుకు క్రికెటర్ కాకపోతే బాగుండు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. అతడిని క్రికెటర్ చేయడం వల్ల చాలా నష్టాలు వస్తున్నాయి. కుటుంబంలో విభేదాలు వచ్చాయి. ఫ్యామిలీలో అందరం వేదనకు గురవుతున్నాం.
పెళ్లి తరువాత కుటుంబంలో చీలికలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అతడి భార్య రివాబానే అని ఆరోపిస్తున్నాడు. నా కొడుకు క్రికెటర్ కాకపోయి ఉంటేనే బాగుండేది. అనవసరంగా క్రికెటర్ ను చేశా. దీంతో పెళ్లి చేశాక ఫ్యామిలీ నరక యాతన అనుభవిస్తోంది. పలు రకాల సమస్యలకు నిలయంగా ఉంటోంది. దీని వల్ల కుటుంబ సభ్యులు అందరం మానసిక క్షోభ అనుభవిస్తున్నాం.
నా కొడుకు క్రికెటర్ కాకపోయి ఉండే ఆమెతో పెళ్లి అయ్యేది కాదు. పెళ్లయి మూడు నెలల్లోనే ఇంట్లో ఇలాంటి వాతావరణం రావడం ఇబ్బందికరం. ప్రస్తుతం అతడి తండ్రి ఒంటరిగానే జీవితం గడుపుతున్నాడట. దీంతో జడేజా తండ్రి ఆవేదన ఓ ఇంటర్య్యూలో వెల్లడించి కన్నీటి పర్యంతమయ్యాడు. తన కోడలు వల్ల ఇల్లే నరకంగా మారిందంటున్నాడు.