
Jagan 2.0 : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొడగొట్టారు. ఇక వచ్చేరోజుల్లో జగన్ 2.0ను చూస్తారంటూ హెచ్చరించారు. ఈ మేరకు విజయవాడ కార్పొరేటర్లతో వైసీపీ అధినేత జగన్ సంచలన కామెంట్స్ చేశారు. తన రెండో దశ పాలనలో పార్టీ కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ప్రజలకు సంక్షేమ పథకాల అమలులో ఆయన మొదటి టర్మ్‌లో కృషి చేసినట్లు చెబుతూ, ఇప్పుడు పార్టీ క్యాడర్‌కు అండగా నిలవడమే తన లక్ష్యమని తెలియజేశారు.
‘జగనన్న 1.0 కార్యకర్తలకు గొప్పగా పని చేయలేకపోయాను.కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వలేక పోయాను.
తొలి విడతలో ప్రతి పథకంలో ప్రజల బాగు కోసం పని చేశాను,ప్రజల మేలు కొరకు పని చేశాను. జగనన్న 2.0 కార్యకర్తల కోసం వేరేగా ఉంటుంది.కార్యకర్తల కోసం ఎలా పని చేస్తానో చూపిస్తా. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదలను. దొంగ కేసులు పెట్టడం తప్ప ఏమి పీకలేరు.కార్యకర్తలు పడే ఇబ్బందులు చూసాను.చంద్రబాబు పాలనలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటాను..కార్యకర్తల కోసం పని చేస్తాను’ అని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు..
చంద్రబాబు పాలనలో వైసీపీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, తమ పార్టీ శ్రేణులకు న్యాయం చేయడానికీ, వారి సమస్యలను పరిష్కరించడానికీ తాను ప్రత్యేకంగా శ్రమిస్తానని హామీ ఇచ్చారు. అలాగే, తన పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టేవారిపై చర్యలు తీసుకుంటానని, అసత్య ఆరోపణలు, కేసులతో వాళ్లను భయపెట్టలేరని స్పష్టం చేశారు.
“జగన్ 2.0” అంటే ప్రజా సంక్షేమం కొనసాగుతూనే, పార్టీ కార్యకర్తలకు మరింత ప్రాధాన్యత ఇచ్చే కొత్త వైఖరి అని అర్థం చేసుకోవచ్చు. ఇది రాజకీయంగా వైసీపీ క్యాడర్‌ను ఉత్సాహపరిచే ప్రయత్నం అనుకోవచ్చు.