Jagan AI image : ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) ఇప్పుడు విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఏది కావాలన్నా ఏఐ చిటికెలో మన ముందుకు తెస్తుంది. గతంలో గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్లు సైతం ఇప్పుడు ఏఐ వైపు అడుగులు వేస్తున్నాయంటే దాని ఉపయోగం.. అవసరం ఎంత ఉందో తెలిసిపోతుంది. మనకు కావాల్సిన సమాచారం కావాలంటే జస్ట్ మీట నొక్కితే చాలు చాలా రకాలుగా, ఆ సమాచారాన్ని ఏఐ మనకు అందజేస్తుంది. టెక్నాలజీ పరంగా ఇప్పటి వరకు చాట్ జీటీపీ, ఏఐ విపరీతంగా ప్రాచర్యంలో ఉన్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కొన్ని ఇమేజ్ లను క్రియేట్ చేసింది. ఈ క్రియేటివిటీని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వైజాగ్ బీచ్ లోని సముద్రం, బండలు, రాళ్లు అంతా కలుపుకొని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఆకారంలో ఉంది. దూరం నుంచి చూస్తే జగన్ ఆకారంలో కనిపించినా.. దగ్గరగా చూస్తే మాత్రం సముద్రం గుట్టలు తప్ప ఇందులో ఇమేజ్ కనిపించదు. ఒక రూములో ఉన్న గన్స్ తో జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కనిపిస్తుంది.
ఇక సాయం సంధ్య సమయంలో సముంద్రంలో ఉన్న ఓడలను కలుపుకొని యంగ్ టైగర్ ఎన్టీఆర్, పర్వతాలలో ప్రభాస్, గన్స్ లతో రాం చరణ్, ఇలా ఒక్కో ఇమేజ్ చూసేందుకు ఒక్కో వస్తువును తీసుకుంది ఏఐ ఏఐతో ఇలాంటి ఇమేజ్ లను చాలానే గీయవచ్చని నిరూపితమైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉన్న వీటిని చూసి నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ ఇమేజ్ లను వాల్ పేపర్లుగా కూడా సేవ్ చేసుకుంటున్నారంటే.