
Jagan attitude in Tirupati : కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి. ఆయనను దర్శించుకునేందుకు ప్రపంచం వ్యాప్తంగా ప్రతీ రోజు కోట్లాది మంది వస్తుంటారు. తిరుమల శ్రీవారి సేవలో ప్రతీ ఒక్కరూ తరలించాలని కోరుకుంటారు. స్వామి వారిని చూస్తేనే ఒళ్లు భక్తి భావంతో పులకించిపోతుంది. ఆ జగన్నాటక సూత్రధారిని దర్శించుకుంటున్నామంటే ఎన్నో జన్మల నుంచి చేసుకున్న పుణ్య ఫలమని ఘంటాపథంగా చెప్పవచ్చు.
‘వేంకటేశ్వరుడి సన్నిధి సకల దేవతలకు పెన్నిధి’. కలియుగంలో శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకుంటే మరో దేవుడిని దర్శించుకోవాల్సిన అవసరం లేదని శాస్త్రాలు చెప్తున్నాయి. అంతటి గొప్పదేవాది దేవుడు అప్పడప్పుడు భక్తుల వద్దకు కూడా వస్తుంటాడు. బ్రహోత్సవాల రూపంలో స్వామి వారు తన లీలను భక్తుల కన్నులకు, చెవులకు విందు చేస్తారు. స్వామి వారి కృపకు పాత్రులం కావాలని కుటుంబంతో కలిసి తిరుమల వెళ్తారు. ఇక ప్రతీ సారి ప్రభుత్వం కూడా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తుంది. నేతలు ఎవరున్నా.. ఏ మతం వారైనా.. ప్రభుత్వం నుంచి లాంచనాలు వెళ్లాల్సిందే.
ఒక సందర్భంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైఎస్ జగన్ వింతగా ప్రవర్తించాడు. తాను ఆ సమస్త జీవకోటిని పాలించే వాడి సన్నిధిలో ఉన్నానన్న సత్యాన్ని మరిచాడు. వేద మంత్రోశ్చారణాలతో వైఎస్ జగన్ ను ఆశీర్వదిస్తున్న సమయంలో వింతగా ప్రవర్తించాడు. తలను దువ్వుకుంటూ స్టైలిష్ వేశాలు వేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్వామి వారి ఎదుట అంత స్టయిల్ ఎందుకని కొందరు అంటుంటే. క్రిస్టియన్ కాబట్టి ఇలా చేస్తున్నాడని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా స్వామి వారి ఎదుట ఇలాంటి పనులు మంచివి కాదని సనాతన ధర్మ ప్రచారకులు మండిపడుతున్నారు.