- చంద్రబాబుకు ఓటేస్తే దండుగేనని సూచన

Kavali Sabha CM Jagan Speech : ఏపీ రైతులకు సీఎం జగన్ వరాలు ప్రకటించారు. ఎన్నో ఏండ్లు గా ఉన్న చుక్కల భూముల సమస్యకు ఆయన చెక్ పెట్టారు. వాటికి శాశ్వత పరిష్కారం చూపుతూ రైతులకు హక్కులు కల్పించారు. రాష్ర్ట వ్యాప్తంగా 97, 471 రైతు కుటుంబాలకు మేలు చేసేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. 2,06, 171 ఎకరాలపై వారికి సంపూర్ణ హక్కులు కల్పించినట్లయ్యింది. గత ప్రభుత్వం నిషేధిత భూముల జాబితాలో చేర్చిన వీటిని రైతులకే కట్టబెడుతూ సీఎం జగన్ నిర్ణయం ప్రకటించారు.
మీకు నేనున్నాను.. అని..
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతుల కష్టాలు స్వయంగా చూశానని పేర్కొన్నారు. మీకు నేనున్నానని భరోసానిచ్చారు. ఇప్పటికే ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందజేశామని, త్వరలోనే గ్రామాల్లో సభల ద్వారా వీటిని అందజేస్తామని చెప్పారు. రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వం తమదేనని, గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు రైతులను అన్నింట ముంచారని ఆరోపించారు. ఇక్కడ పెత్తందార్లకు పేదలకు యుద్ధం జరుగుతున్నదని, చంద్రబాబుతో కలిసి ఎల్లో మీడియా తమపై దుష్ర్పచారం చేస్తోందని విమర్శించారు.
అమరావతిలో పేదలకు ఇండ్లు ఇస్తుంటే కూడా వారు చూడలేకపోతున్నారని మండిపడ్డారు. ఎన్నికలు దగ్గర పడుతుంటే టూరిస్టుల్లా బాబు, ఆయన దత్తపుత్రుడు రోడ్డెక్కారని ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాల అమలులో ఏపీ ఆదర్శంగా నిలుస్తున్నదని, దీనిపై కూడా దివాళా తీసిందని కట్టు కథలు అల్లుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు, వారి సంక్షేమమే మాకు ముఖ్యమని, అదే లక్ష్యంతో ముందుకెళ్తామని చెప్పారు. దుష్టచతుష్టయం చేస్తున్న ప్రచారం పై ప్రజలంతా ఆలోచించుకోవాలని చెప్పారు. అంతకుముందు విజయవాడలో ప్రారంభమైన శ్రీ లక్ష్మీ మహాయజంలో సీఎం జగన్ పాల్గొన్నారు.