Jagan CM in 1924 : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అధికార.. ప్రతిపక్ష పార్టీల మధ్య హోరా హోరీ ఫైట్ నడుస్తోంది. ఈక్రమంలోనే సోషల్ మీడియాలో అధికార.. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన పలు కామెంట్స్ ట్రోల్స్ రూపంలో వైరల్ గా మారుతున్నాయి.
తాజాగా ఓ వీడియోలో వైసీపీ పార్టీకి చెందిన ఓ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి 1924లో సీఎం కావాలని ఆకాంక్షను వ్యక్తం చేశాయి. అయితే 2024కు బదులుగా 1924 అని పొరపాటుగా చెప్పాడు. దీనిని ప్రతిపక్ష పార్టీకి చెందిన మరో వ్యక్తి ట్రోల్స్ చేశాడు. జగనన్న ప్రవేశపెట్టిన మద్యం బ్రాండ్లు తాగితే ఇలానే ఉంటుందన్నాడు. 1924 ఏంట్రా అయ్యా అంటూ కామెడీ చేశాడు.
జగన్ బ్రాండ్లు తాగి మైండ్ దొబ్బినట్టు ఉంది.. టైంకు మాత్రలు వేసుకోరా అయ్యా అంటూ మాస్ ర్యాగింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ వీడియోపై నెటిజన్లు సైతం తమదైన శైలిలో ట్రోల్స్ చేస్తుండటం గమనార్హం.