
తాన మాట తప్ప ఏవరి మాట వినని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి తత్వం ఏవరికి బోధ పడదని పార్టీ వర్గాల్లో, ఏపీ ప్రజల్లో జరుగుతున్న చర్చ అందుకు తగ్గట్లుగానే ఆయన వ్యవహార శైలి ఉంటుంది. తాను చెప్పినట్లుగానే పార్టీగానే, ప్రభుత్వం గాని నడవాలి .. తనను కాదని ఏవరు ఏం నిర్ణయం తీసుకోకుడదు అని హుకుం జారీ చేశారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
అందుకు తగ్గట్లుగానే పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేండ్లు గడుస్తున్నా పార్టీలో నిర్ణయాలన్ని జగన్ తప్ప ఏవరు తీసుకోరు అనడంలో అతియోశక్తి లేదు.. మంత్రులు పేరుకు మాత్రమే మంత్రులు తమ శాఖల్లోని నిర్ణయాలు తీసుకోవాలన్న సీఎం నుంచి అదేశాలు రావాలనే ప్రచారం జనంలో ఉంది. అయితే ఇప్పుడు జగన్ చూపు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వైపు మళ్లిందని అంటున్నారు అధికారులు…
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అంటే అస్సలు నచ్చడం లేదని ఆధికారవర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆయన పూర్తి స్థాయి డీజీపీ కాదు. అడహాక్ డీజీపీనే కేంద్రం ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఆ ప్రక్రియను ఏపీ ప్రభుత్వం త్వరగా పూర్తి చేయడం లేదు. కారణం ఏదైనా ఆయన డీజీపీగాఉన్నారు. కానీ జగన్ ఆలోచనలకు తగ్గట్లుగా ఆయన మసలుకోలేకపోతున్నారు. ఆయన కోరుకునే అరాచక స్థాయిని పోలీసులు అందుకోలేకపోతున్నారన్న గుసగుసలు వినిిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జగన్ పోలీసుల నుంచి ఇంకా చాలా దూకుడు కోరుకుంటున్నారు. కానీ లాంటిది కనపడటం లేదంటున్నారు.
అసలు సంబంధం లేని ఆదాయార్జన శాఖలపై సమీక్షలో సీఎం జగన్ ఏసీబీ డీజీగా రాజేంద్రనాథ్ రెడ్డిని తొలగించాలని స్పష్టం చేశారు. ఆయన అటు డీజీపీగా ఇటు ఏసీబీ డీజీగా ఉండలేరని చెప్పుకొచ్చారు. అందుకే ఆ సమీక్షలో తనకు ఎదురుగా కనిపించిన రవిశంకర్ అయ్యన్నార్ ను ఏసీబీ డీజీగా నియమించాలని జగన్ సూచించారు. కానీ రవిశంకర్ అయ్యన్నార్ కుఇంకా డీజీ హోదా రాలేదు. అంతసీనియర్ కాదు. ఆయన ఏడీజీనే. అది తెలియకుండా జగన్ ఆయనను నియమించాలన్నారు. పక్కన వాళ్లు చెప్పినా పట్టించుకోలేదు. ఆ నియామం జరుగుతుందో లేదో కానీ జగన్ మాత్రం అర్జంట్ డీజీపీ నిర్వహిస్తున్న ఓ కీలకమైన విభాగాన్ని ఆయన నుంచి తప్పించాలనుకున్నది మాత్రం స్పష్టమయిందంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కొత్త డీజీపీ ఎంపిక విషయంలో కేంద్రం నిబంధనలు గుర్తు చేసినా లేదా జగనే ఆయన వద్దని కొత్త వారిని ఎంపిక చేసుకున్నా.. డీజీగా చేసి రవీంద్రనాథ్ రెడ్డి అప్రాధాన్య పోస్టులోకి వెళ్లాల్సి ఉంటుంది.






