Jagan dummy : 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీని ఓడించి వైసీపీ భారీ మెజార్టీతో అధికారంలో వచ్చిన విషయం తెలిసిందే. కానీ దీని వెనుక ప్రశాంత్ కిషోర్ స్థాపించిన ఐ-ప్యాక్ అంతా తానై నడిపించింది. రాజకీయంగా వ్యూహాలు రచించింది. ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలో నిర్దేశించింది. దీంతో తాను అనుకున్న లక్ష్యాన్ని జగన్ సాధించాడు. ఏపీకి సీఎం అయ్యాడు. అయితే 2024 ఎన్నికల్లోనూ అదే టీమ్ కీలకంగా వ్యవహరించనుంది. దీంతో ఆ టీమ్ చెప్పినట్లుగానే వైసీపీ నాయకులు నడుచుకోవాల్సి ఉంటుందనే పుకార్లు వస్తున్నాయి. వైసీపీ ప్రజాప్రతినిధులు ఐ ప్యాక్ నిఘాను ఆహ్వానించాల్సిందేననే రూమర్లు వస్తున్నాయి. పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ కాకుండా తమకు మరొకరు దిశానిర్దేశం చేయడం ఏమిటనే చర్చలు సాగుతున్నాయట.
ఐ ప్యాక్ నిఘా గతంలో ఎమ్మెల్యేల స్థాయిలో ఉండేది. ఇప్పుడు స్థానిక సంస్థలకు పాకింది. గుంటూరు కౌన్సిల్ మీటింగ్ లో ఐ ప్యాక్ సిబ్బందిని కూర్చోబెట్టడం దుమారం చెలరేగుతున్నది. అధికారుల మధ్యలో కూర్చుంటున్నారని, దీంతో వారిని గుర్తుపట్టలేపోతున్నామని పలువురు పేర్కొంటున్నారు. ప్యాక్ సిబ్బంది ని ఇలా కౌన్సిల్ మీటింగ్‌కు ఎందుకు వస్తున్నారనేది వైసీపీ నేతలకు అంతు చిక్కడం లేదు.
ఐ ప్యాక్ నిఘా సొంత పార్టీలో అన్ని స్థాయిల్లోనూ నేతల పని తీరును అంచనా వేయడానికి, సెకండ్ కేటగిరీ లీడర్ల పని తీరును గుర్తించడానికి జగన్ అంతర్గతంగా మరో వ్యవస్తను ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తున్నది. కౌన్సిల్ మీటింగ్ కు హాజరై గుంటూరులో కార్పొరేటర్ల పని తీరుపై రిపోర్టు తయారు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరీ ఇంత నిఘా ఎందుకో అర్థం కావడం లేదని వైసీపీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ నేతలపై ఇంత అనుమానమా అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
కానీ వైసీపీలో మాత్రం నిఘాను ఆహ్వానించాల్సిందే అంటూ పలువురు నేతల పేర్కొంటున్నారు. ఐ ప్యాక్ సభ్యులకు తమపై నిఘా పెట్టడానికి వైసీపీ నేతలు సౌకర్యాలు కల్పించాల్సిన పరిస్థితి. ఎమ్మెల్యేల పనితీరుపై తప్పుడు నివేదికలిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక రాజకీయాల గురించి తెలియని వారిని తీసుకొచ్చి.. తమపై మోపడం ఏమిటని, వారితో సర్టిఫికెట్లు ఇప్పించడం తమను అవమానించినట్లేనని ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే అదనుగా కొన్ని చోట్ల ఐ ప్యాక్ సభ్యులు పార్టీ నేతల వద్ద డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సగం మందికిపైగా ఎమ్మెల్యేలు గడప గడపకూ వెళ్లడం లేదని, కానీ 18 మంది పేర్లు చెప్పడం వెనుక ఏదో జరగబోతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐ ప్యాక్ చెప్పిందే జగన్ వేదం లా భావిస్తున్నారని పార్టీ వర్గాల టాక్. జగన్మోహన్ రెడ్డి ప్రతీ దానికి ఐ ప్యాక్ మీదే ఆధారపడుతున్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐ ప్యాక్ చెప్పిందానికి, జరిగిన దానికి చాలా తేడా ఉన్నది. జగన్ కు ఐ ప్యాక్ తప్ప మరో దారిన కనిపించడం లేదు. వారు చెప్పినట్లే చేస్తున్నారు. దీంతో జగనే ఏమీ చేయలేక ఐ ప్యాక్ చెప్పింది చేస్తే, ఇతర నేతలు సొంత రాజకీయాలు ఎలా చేస్తారనే సెటైర్లు వినిపిస్తున్నాయి. ఐ ప్యాక్ గుప్పిట్లో చిక్కుకున్న వైసీపీ విలవిలలాడుతున్నదని ఇతర పార్టీల నేతలంటున్నారు.