39.2 C
India
Thursday, June 1, 2023
More

    Jagan Govt : చంద్రబాబును తట్టుకున్న జగన్.. ఆయన పాలన భేష్ అంటూ పొగడ్తలు..

    Date:

    Jagan Govt
    Jagan Govt

    Jagan Govt : ఏపీని నాలుగేళ్లు పాలించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని అడ్డంకులను ఎదుర్కొని తన పాలనను ప్రారంభించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల అనుభవం, 14 ఏళ్ల పాలనలో బలమైన రాజకీయ నాయకుడు. పరిపాలనలో, న్యాయ వ్యవస్థతో సహా వివిధ సంస్థల్లో చంద్రబాబుకు బలమైన సంబంధాలు ఉండగా, జగన్ ఈ వ్యవస్థలకు కొత్త రూపం కల్పించాడు.

    జగన్ తీసుకునే ప్రతి నిర్ణయానికి గతంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడి మద్దతుదారుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది కొవిడ్-19 ప్రపంచ విపత్తు మానవ జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేసింది. ఈ విపత్కర సమయంలో ప్రజలను ఆదుకుంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. కానీ చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ కు ఎక్కువగా సవాళ్లను విసిరారనే చెప్పారు. ఒకరకంగా చెప్పాలంటే కొవిడ్-19 కంటే చంద్రబాబు వైఎస్ జగన్ ను ఎక్కువగా ఇబ్బంది పెట్టారంటూ ఏపీలో వార్తలు కూడా వినిపిస్తుంటాయి.

    ఒకవైపు చంద్రబాబు నాయుడు సృష్టించిన అడ్డంకులు, మరోవైపు కొవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ జగన్ తొలిసారిగా ప్రజలకు నేరుగా నగదు అందిస్తూ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ)కి శ్రీకారం చుట్టారు. డీబీటీ అమలుకు జగన్ ను అడ్డుకోలేదని, ఇప్పటి వరకు రూ.2.1 లక్షల కోట్ల నగదును ప్రజలకు బదిలీ చేశారు. ప్రయోజనాలు, సేవలను ప్రజల ముంగిటకి తెచ్చేందుకు పాలనా సంస్కరణలను ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాలు తన పార్టీ నాయకులను విమర్శించినా, వేధించినా జగన్ పట్టుదలగా ముందుకు వెళ్లారు.

    ఆరోగ్యం, విద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి ప్రైవేటు సంస్థలకు ముప్పుగా పరిణమించారు. తన సొంత మంత్రి వర్గం, నామినేటెడ్ పదవులతో సహా రాజకీయాల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సాధికారత కల్పించారు. బోధన ఆసుపత్రులతో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ప్రజలకు వైద్యసేవలు మెరుగుపరిచారు సీఎం జగన్. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జిల్లాల పునర్విభజన, 26 కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేశారు.

    టాప్-5 పారిశ్రామికవేత్తలను, వ్యాపారవేత్తలు రాష్ట్రానికి రావడం జగన్ ప్రభుత్వంలోనే జరిగింది. వారి రాకతో ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. వారి ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఆయన నానా తంటాలు పడ్డారని, తాను చేసిన సానుకూల పనులను సమర్థవంతంగా తెలియజేయడంలో విఫలమయ్యారన్నారు. తన పార్టీ కార్యకర్తలతో సత్సంబంధాలు కొనసాగించడంలో సవాళ్లను కూడా ఆయన ఎదుర్కొన్నారు, ఇది వారిలో నిర్లక్ష్య భావనలకు దారితీసింది.

    Share post:

    More like this
    Related

    మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ కలిసి ఒక మూవీ చేశారు తెలుసా..?

        టాలీవుడ్ ఏంటి బాలీవుడ్ లోనే పెద్దగా పరిచయం అక్కర్లేని పేర్లు మెగాస్టార్...

    ఆయన ఆశీస్సులు తనపై ఉంటాయి.. కృష్ణను గుర్తు చేసుకున్న నరేశ్..

        తండ్రి స్థానంలో ఉంటూ తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా చూసుకున్న సూపర్...

    అల్లుడితో లేచిపోయిన అత్త..!

          మాతృపంచకంలో అత్తా కూడా ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి. తల్లి తర్వాత...

    దేశంలో పర్యాటక ప్రదేశాలు ఏంటో తెలుసా?

          వేసవి సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి చాలా మంది అందమైన ప్రదేశాలను సందర్శిస్తుంటారు....

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandra Babu Assets : చంద్రబాబు ఆస్తులు జప్తు..అనుమతి కోరిన సీఐడీ.. 

    Chandra Babu assets : ఏపీ రాజధాని నగర బృహత్ ప్రణాళిక,...

    TDP manifesto : ప్రజల్లోకి వెళ్లేదేలా.. నిన్నటి వరకు తప్పు.. నేడు ఒప్పా?

    టీడీపీ మేనిఫెస్టో పై నాయకుల్లో కలవరం TDP manifesto : టీడీపీ మినీ...

    CM Jagan : ముందస్తుకు జగన్ వెళ్తున్నారా.. కేంద్రం హామీ ఇచ్చిందా..?

    CM Jagan : ఏపీ సీఎం జగన్ రెండు రోజులపాటు ఢిల్లీ...

    ఓటు బదిలీపై చంద్రబాబు హడల్..! జనసేనతో పొత్తు బాబుకు లాభిస్తుందా..?

    vote transfer : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం...