Jagan Insecure : తెలగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగానే చూస్తున్నారు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ లోని మెజారిటీ సామాన్య ప్రజలు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ప్రఖ్యాత ‘సీ ఓటర్’ సంస్థ ఒక సర్వే నిర్వహించింది. దీనికి సంబంధించిన రిపోర్ట్ చూద్దాం.
1809 మందిని సర్వేలో భాగంగా వివిధ ప్రజలు అడిగితే 58 శాతం మంది జగన్ వచ్చే ఎన్నికల గురించి భయపడుతున్నారని, అభద్రతా భావంతో ఉన్నారని, అందుకే చంద్రబాబు నాయుడిపై కేసు పెట్టి అరెస్టు చేయించారని అభిప్రాయపడ్డారు.
రాజకీయ పార్టీ మద్దతుదారులు, వారి అభిప్రాయాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించారు. సొంత భవిష్యత్తుకు భయపడి జగన్ సీబీఎన్ ను అరెస్టు చేశారని 86 శాతం మంది టీడీపీ మద్దతుదారులు భావిస్తున్నారు.
వైసీపీలో 36 శాతం మంది కూడా జగన్ కంగారు పడుతున్నారని, ఇది జగన్ సొంత శిబిరంలో చీలికలు తెచ్చే అంశమని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతానని జగన్ భయపడుతున్నారని, అందుకే తన పాలన చివరి నెలల్లో కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారనే ప్రచారం కూడా ఉంది.
ఈ సర్వే నివేదిక ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మానసిక స్థితిని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. ఇలాంటి కక్షసాధింపు రాజకీయాలు వైసీపీకి ఉన్న చిన్న చిన్న అవకాశాలను కూడా నాశనం చేస్తాయి.
చంద్రబాబు అరెస్ట్ నిందను ప్రభుత్వం తమ మీద నుంచి పక్కకు తప్పిస్తే తప్ప కనీసం డిపాజిట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందని సర్వత్రా చర్చ జరుగుతోంది.