AP cm jagan : ఏపీ సీఎం జగన్ ఓ చిన్నారికి పేరు పెట్టారు. అదేంటి చిన్నారికి సీఎం జగన్ పేరు పెట్టడం ఏంటి అనుకుంటున్నారా.. ఆయన ప్రస్తుతం కోనసీమ పర్యటనలో కూనవరం, వీఆర్ పురం మండలాల్లో వరద బాధితులను పరామర్శిస్తున్నారు. బాధితులతో తానే స్వయంగా కలిసి మాట్లాడుతున్నారు. వారి పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. అయితే కూనలంక గ్రామంలోని ఓ కుటుంబం ఆయన వద్దకు వచ్చింది. వారి వద్ద పిల్లాడిని తీసుకొని ఏం పేరని అడిగారు. దీంతో తమ పిల్లాడికి మీరే పేరు పెట్టాలని వారు కోరారు.
అయితే కుటుంబ సభ్యులు డీ అనే అక్షరంతో పేరు పెట్టాలని సీఎం జగన్ ను కోరారు. అయితే ఆ పిల్లాడిని ఆప్యాయంగా ఎత్తుకొని ముద్దు పెట్టిన సీఎం జగన్ దేవుడు అని పేరు పెట్టారు. దీంతో తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. తమ పిల్లాడికి ఏకంగా సీఎం జగన్ పేరు దేవుడు అని పేరు పెట్టడంతో ఇక వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
అయితే సీఎం జగన్ దేవుడు అనే పదాన్ని తరచూ వాడుతుంటారని, అందుకే ఆయన నేరుగా అదే మాట పలికారని పలువురు చెబుతున్నారు. అయితే గ్రామంలో వరద పరిస్థితులు తెలుసుకొనేందుకు తండ్రిలా, పెద్దన్నలా వచ్చిన జగన్ ఆ బాబుకు జగన్ మామయ్య అయ్యాడని పలువురు చర్చించుకోవడం కనిపించింది. అయితే సీఎం జగన్ ఆ పిల్లాడికి పేరు పెడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆ వీడియోను షేర్ చేస్తూ పోస్టు చేస్తున్నారు.