Jagan pro-advocate : 2004-09 మధ్యకాలంలో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో క్విడ్ ప్రో కో విధానంలో వేల కోట్ల అక్రమాస్తులు జగన్ సంపాదించారని 2012లో సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. ప్రభుత్వం నుంచి లబ్ది పొందిన పారిశ్రామిక సంస్థలు.. లంచాలను జగన్ సొంత కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టాయని సీబీఐ ఆరోపణలు గుప్పించింది. మొత్తం జగన్ పై 11కేసుల్లో సీబీఐ చార్జ్షీట్లు నమోదు చేసింది. ఈ కేసుల్లో విచారణను ఎదుర్కొన్న జగన్ను 2012 మే లో సీబీఐ అరెస్ట్ చేసింది. 2012 మే నుంచి 2013 సెప్టెంబర్ వరకూ ఆయన చంచల్గూడ జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు. 2013 సెప్టెంబర్లో బెయిల్పై విడుదలయ్యారు. అప్పటి నుంచి ప్రతి శుక్రవారం జగన్ సీబీఐ కోర్టు విచారణకు హాజరవుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు నుంచి జగన్ విచారణకు హాజరుకావడం లేదు. ఆయన చివరి సారిగా మార్చి 22, 2019న సీబీఐ కోర్టుకు వచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఉండగా.. సీబీఐ కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందారు. 2019 ఎన్నికల్లో గెలుపొంది ముఖ్యమంత్రి అయ్యాక.. ఆయన కోర్టుకు హాజరుకాలేదు.
ఆయన తరఫున నియమించున్న న్యాయవాదులే హాజరవుతూ వస్తున్నారు. ఆ తర్వాత తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ సీఎం జగన్.. సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. మఖ్యమంత్రిగా అధికార విధుల్లో తీరిక లేకుండా ఉంటుందని..ఆ హోదాలో కోర్టుకు హాజరుకావడం.. ఆర్థికంగా భారం అవుతుందని ఓ పిటిషన్ దాఖలు చేశారు. అయితే నవంబర్ 1న సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ పిటిషన్ను కొట్టేసింది. హోదా మారినంత మాత్రాన హాజరునుంచి మినహాయింపు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావలసిందేనని స్పష్టం చేసింది. అత్యవసరం అయితే అప్పటికప్పుడు మినహాయింపు కోరవచ్చని సూచించింది. నవంబర్ నుంచి అధికారిక విధుల పేరుతో.. సీఎం కోర్టుకు హాజరుకావడంలేదు. దీనిపై ఆగ్రహించిన న్యాయస్థానం కచ్చితంగా కోర్టుకు హాజరు కావలసిందేనంటూ ఉత్తర్వులు ఇచ్చింది.
కాగా సీఎం బెయిల్ పొందడంలో అప్పటి అడ్వకేట్ కేవీ విశ్వనాథన్ కీలకపాత్ర పోషించారు. ఆయన జగన్ లక్షకోట్ల దోపిడీని సమర్థిస్తూ కోర్టులో వాదించారు. ఆ తర్వాత ఆయనకు పదోన్నతి కలిగి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం లడ్డూ వివాదం సుప్రీంకోర్టుకు చేరడంతో విచారణ చేపట్టారు. ఈ సందర్భంలో తిరుపతి లడ్డూ కల్తీ అయిందనడానికి సాక్ష్యం ఏంటని ప్రశ్నించారు. అలాగే ఆయన కిలో ఆవు నెయ్యి రూ.319కే ఎలా వస్తుందని ప్రశ్నించారు. దీనిపై పూర్తి స్థాయిలో ఆధారాల్లేకుండా సీఎం అంతటి వ్యక్తి ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. సాక్ష్యాధారాలతో రావాలని సూచించారు. ఏఆర్ డైయిరీ పంపిన నెయ్యిలో కల్తీ జరిగిందని సదరు రిపోర్టు తేల్చినప్పటికీ న్యాయమూర్తి ఇలా కోరడం వెనుక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.