- ఇంతకీ ఎవరికీ గుండెపోటు

Heart Attack : అవును గుండెపోటు (Heart Attack) అని చెప్పింది వైఎస్ జగనే.. మాకు ముందుగా ఆయనే ఈ విషయం చెప్పారు.. అంటూ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం చెప్పినట్లు సమాచారం.. ఇంతకీ ఎవరికి గుండెపోటు అని అనుకుంటున్నారా.. అయితే చదివేయండి
గత ఎన్నికల ముందు వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. అయితే ఆ తర్వాత హత్య అని తేలినా, అంతకుముందు పెద్ద డ్రామా నే కొనసాగింది. అక్కడి రక్తపు మరకలను తుడిపేసి ముందుగా వివేకాది గుండెపోటు అని ప్రకటించారు. ముందుగా వైసీపీ అనుకూల మీడియాలో ఇది గుండెపోటు అని ప్రచారం మొదలుపెట్టారు.
అయితే ఆ తర్వాత అది గుండెపోటు కాదు కిరాతకంగా చంపారని తేలింది. అయితే ఆ తర్వాత కూడా దీనిని టీడీపీ శ్రేణులపై నెట్టేసే ప్రయత్నం జరిగింది. కానీ ఇప్పుడు వైసీసీ కి చెందిన కీలక నేతలే పాత్రధారులని సీబీఐ విచారణలో తేలుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లంను సీబీఐ తాజాగా ప్రశ్నించింది. జగనే ముందుగా మాకు గుండెపోటు అని చెప్పారు. ఉదయాన్నే ఈ విషయం మాకు చెప్పారని సీబీఐ ముందు వాంగ్మూలం ఇచ్చినట్లుగా సమాచారం.
అప్పుటికే సీఎం జగన్ ఎన్నికల ప్రణాళికపై తన అంతరంగికులతో చర్చలు జరుపుతున్నారు. ఈ విషయం మాకు అప్పుడే తెలిసింది. అని సీబీఐకి అజయ్ కల్లం చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే కొన్నాళ్లుగా వివేకా కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే పార్టీ ఎంపీ అవినాష్ కు నోటీసులు జారీ చేసింది. త్వరలోనే ఆయనను అరెస్ట్ చేయవచ్చని తెలుస్తున్నది. ఇందులో కీలక నిందితులంతా ఇఫ్పటికే జైలు పాలయ్యారు. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా సీబీఐ అరెస్ట్ చేసి జైలులో పెట్టింది.