
Jagan : ఎన్నికలు సమీపిస్తున్న వేల వైఎస్ జగన్ సోషల్ మీడియా యాక్టివ్ గా మారింది. ఇందులో ఒక్కో పంచ్ తూటాకన్నా పదునుగా పేలుతున్నాయి. అయితే సోషల్ మీడియాకు సంబంధించి పాత టీమ్ ను తొలగించి కొత్త టీమ్ ను తెచ్చుకున్నారట జగన్. ఆ బాధ్యతలను కూడా సజ్జల కుమారుడు నిర్వర్తిస్తున్నాడు. ఆయన వచ్చాక ఇలాంటి క్రియేటివ్ మోడల్ లో వైసీపీ యాక్టివ్ గా మారింది. ప్రత్యర్థులు బాబు, పవన్, రామోజీ, రాధాకృష్ణపై ఫుల్ ఫైరింగ్ సాగుతోంది. సగటు నెటిజన్ ఆకట్టుకునేలా వీడియోలు, మీమ్స్, కార్టూన్ లతో సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నారు.
రీసెంట్ గా ఏపీలోని పేదలు, ప్రజలకు అండగా జగన్ ఉన్నట్టు విడుదల చేసిన ఓ కార్టూన్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటలు, ఆటలు, వాళ్ల కుతంత్రాల నుంచి ఏపీ ప్రజలను కాపాడుతున్నట్లు కనిపిస్తుంది. పొలిటికల్ పార్టీల పెద్దల నుంచి జర్నలిస్ట్ వ్యక్తుల నుంచి ఏపీ ప్రజలను కాపాడుకుంటాను అంటూ పేద మొహంతో జగన్ కనిపిస్తుంటాడు. ఎవరు ఎందుకు గీశారో కానీ ఈ కార్టూన్ ఏపీలో ప్రస్తుత పరిస్థితిని చూపెడుతుంది.
టీడీపీ అండ్ టీం దోపిడీ, కక్ష సాధింపునకు అద్దం పడుతోంది. చంద్రబాబు సీఎం అయితే అమరావతి భూములు కొల్లగొడతారంటూ వైసీపీ ఆరోపిస్తుంది. దీనినే థీమ్ గా తీసుకొని ఈ కార్టూన్ పడింది. రైతులకు తెలియకుండానే కోట్లాది రూపాయల భూములను బాబు పార్టీ నేతలతో కొనుగోలు చేయించి దోపిడీ చేయించారని ఆరోపణలు ఉన్నాయి. ప్రతీ ఒక్కటి ఇన్ సైడర్ ట్రేడింగే ఇందులో కనిపించింది. గత 40 సంవత్సరాల పాలిటిక్స్ అంటూ వ్యవస్థలన్నీ గుప్పిట పట్టుకొని చంద్రబాబు ఆడుతున్న ఆట అని.. ఇప్పటికీ బలమైన మీడియా మేనేజ్ మెంట్ తో అధికార పార్టీలకే చెమటలు పట్టిస్తున్నాడు బాబు అంటూ ఫోకస్ అయ్యేలా కార్టూన్ గీసినట్లుంది.

ఇప్పటికీ అధికారం కోసం వారు పన్నే పన్నాగాలను కర్టూన్ లో చూపించే ప్రయత్నం చేశారు. బాబు, లోకేశ్ ఉన్న పల్లకీని పవన్, రామోజీరావు, రాధాకృష్ణ, తదితరులు మోస్తున్నట్లు గీశారు. ఇక కింద జగన్ పైకి బండలు విసిరే వారు వ్యాపారులు, జర్నలిస్టులుగా చూపించారు. ఇక జగన్ వెనుక ఆ రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు రైతులు ఉండగా, ఏకే పాల్ ఎక్కడా శాంతి మంత్రం జపిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఏది ఏమైనా కార్టూన్ మొత్తం జగన్ కు ఫెవర్ లా కనిపిస్తుంది. ఆయన అందులో హీరో ఈ చిత్రం ఏపీ రాజకీయ భవిష్యత్ ను చూపిస్తుంది. జగన్ పై చంద్రబాబు సహా ఎంతో మంది దాడులు చేస్తున్నారని ఫోకస్ అవుతోంది. ఏపీ ప్రజలకు మంచి చేయడమే జగన్ పరమావధి అన్నట్లు చూపించారు. అందుకే టీడీపీ ఆయనను టార్గెట్ చేసిందని చూపారు.
ఇంత హైప్ తెచ్చుకున్న కార్టూన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ కు గురవుతుంది. కార్టూన్ లో కుడివైపున (మనకు) కంద ఒక చిన్నారి గొడ్డలి పట్టుకుంది. కింద ఒకరు పడిపోయి ఉన్నారు. గొడ్డలు పట్టుకున్నవ్యక్తిని జగన్ గా, కింద పడిపోయిన వ్యక్తిని వైఎస్ వివేకానంద (తన బాబాయి)గా రాసి మరీ ట్రోల్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సోషల్ మీడియా వేదికగా ఒక ఆట ఆడుతున్నారు పార్టీల నాయకులు.