Jagan Target same : రాజకీయ పార్టీలెవైనా అధికారం కోసం తపిస్తుంటాయి. ఎన్నికలు వచ్చాయంటే గెలుపు మాదే అనే ధీమాతో ముందుకు వెళ్తుంటాయి. వాటికి కావాల్సింది కూడా అదే. చివరి ఓటు లెక్క తేలేదాకా మనదే గెలుపు అనే ప్రతి రాజకీయ నాయకుడి మాట ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో అదే జరుగుతున్నది. టీడీపీ, వైసీపీ , జనసేన మధ్య వార్ మొదలైంది. సీఎం పీఠమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి.
అయితే టీడీపీ, జనసేన పొత్తులతో ముందుకెళ్లేందుకు పావులు కదుపుతున్నాయి. కాపుల ఓట్లే లక్ష్యంగా ప్రస్తుతం పవన్ వారాహి యాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు కాపు సామాజికవర్గం నుంచి అనూహ్యంగా స్పందన వస్తున్నది. ఇది గుర్తించిన వైసీపీ అధినేత జగన్ మరో ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. కాపులు పవన్ వైపు మొగ్గుచూపితే బీసీలను తనవైపు తిప్పుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఈ దిశగా వారికి వరాలు ప్రకటించే ఉద్దేశంతో ఉన్నారని సమాచారం.
వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని జగన్ భావిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు తనను గద్దె దింపేందుకు చేతులు కలిపారు. బీజేపీ కూడా వారివైపే మొగ్గు చూపే అవకాశం కనిపిస్తున్నది. ఈ లెక్కలు చూసుకుంటే 2024 ఎన్నికల్లో జగన్ కు మరింత కష్టమవుతుంది. ఒక్క సంక్షేమ పథకాలనే నమ్ముకొని ఇప్పటివరకు పాలన సాగిస్తున్న జగన్ గెలుపునకు అవే దోహదపడుతాయని భావిస్తున్నారు.
మరి తననే టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు దూసుకొస్తుండగా, జగన్ ఇప్పటివరకు ప్రజా క్షేత్రంలోకి రాలేదు. ప్రస్తుతం రాష్ర్టంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. దీనికి కారణం జగన్ కాకున్నా, ఆయన కోటరీ అనేది టాక్. అయితే జగన్ మాత్రం ప్రస్తుతం పీకే టీమ్ పైనే ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తున్నది. ఏపీలో తాను చేసిన దానికంటే ఎక్కువగానే ఈ టీం ప్రచారంలో పెడుతుంది. సోషల్ మీడియాలో జగన్ పై పాజిటివ్ గా ప్రచారం చేస్తూ , ప్రజల్లోకి ఈ టీం వెళ్తుంది.